choreographer held in prostitution racket run in kenya విదేశాల్లో వ్యభిచారం రాకెట్.. కొరియోగ్రాఫర్ అరెస్టు..

Bollywood choreographer held in prostitution racket being run in kenya

agnes hamilton, choreographer, arrest, prostitution racket, Rajiya Patel, Nairobi, dance in club, kenya, Kenyan police, Dilip Sawant, anti-extortion cell, bollywood, mumbai, crime

According to police, the accused, Agnes Hamilton, allegedly sent a few girls abroad with job prospects, but they were forced into prostitution. Hamilton runs a dance class in Adarsh Nagar, Andheri.

విదేశాల్లో వ్యభిచారం రాకెట్.. కొరియోగ్రాఫర్ అరెస్టు..

Posted: 11/16/2018 01:04 PM IST
Bollywood choreographer held in prostitution racket being run in kenya

అమ్మాయిలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపి.. నెలకు లక్షకు పైగా వేతనాన్ని అర్జించవచ్చని ఆశచూపి.. విదేశాలకు తరలించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తున్న ఓ కొరియోగ్రాఫర్ గుట్టురట్టైంది. అమె చేతిలో మోసపోయి.. అప్పు చేసి విదేశాలకు వెళ్లిన ఓ బాధితురాలు.. ముంబై పోలీసులను అశ్రయించి.. అమెపై పిర్యాదు చేయడంతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ చీకటి బాగోతాలు వెలుగుచూశాయి. అంధేరీలోని ఆదర్శ్ నగర్ లో నివసించే కొరియోగ్రాఫర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబాయిలోని అంధేరి ప్రాంతంలోగల అదర్శ్ నగర్ ఖండావాలా సమీపంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అగ్నేస్ హమిల్టన్ (56).. బాలీవుడ్ హబ్ పేరిట డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మలేషియా తదితర దేశాల్లో తరుచూ పర్యటనలు చేస్తూ ప్రదర్శనలు ఇస్తున్నారు. అయితే ఈ వ్యాపారం అంతగా కలసిరాలేదో లేక ఎలాంటి శ్రమలేకుండా డబ్బును అర్జించాలని భావించిందో కానీ.. ఇక్కడి నుంచి మన దేశం అమ్మాయిలను పరాయిదేశాలకు తరలించి అక్కడ వారితో వ్యభిచారంతో పాటు క్లబ్ లలో అర్థనగన్న నృత్యాలు వేయించేందుకు పంపించింది.

ఈ మేరకు అమె చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు అమెపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పిర్యాదు చేయడంతో డొంక కదిలింది. పిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. కొరియోగ్రాఫర్ ను అదుపులోకి తీసుకున్నారు. కొరియోగ్రాఫర్ మాటలు నమ్మి.. కెన్యాలోని నైరోబికి చేరుకున్న ఓ బాధితురాలు.. అమె తనను రజియా పటేల్ అనే మహిళ వద్దకు పంపిందని, అమె అక్కడ తమతో క్లబ్ లలో డాన్సులు చేయాలని అదేశించిందని తెలిపింది. దీనికి అంగీకరించకపోతే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇరికిస్తామని పటేల్ బెదరించిందని తెలిపింది.

అంతేకాదు తమ పాస్ పోర్ట్ సైతం లాక్కుని.. తమతో వ్యభిచారం కూడా నిర్వహించేదని బాధితురాలు తమ అవేదనను పిర్యాదులో పేర్కోంది. అయితే ఇటీవల కెన్యాలోని ఓ హోటల్‌లో నృత్య ప్రదర్శన చేస్తున్న సమయంలో అక్కడి పోలీసులు అకస్మిక దాడులు నిర్వహించి.. తమను అదుపులోకి తీసుకున్నారని, వివరాలు తెలుసుకుని ఇలా ఎవరిచేతిలోనో మోసపోయి ఇక్కడకు వచ్చి గత్యంతరం లేక నిర్వాహకులు చెప్పిన పనులు చేస్తున్నామని యువతులు తమ అవేదనను వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని తమ తమ దేశాలకు పంపించేశారని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agnes hamilton  choreographer  arrest  prostitution racket  kenya  bollywood  mumbai  crime  

Other Articles