PM Modi inaugurates world's tallest statue of Unity ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఆవిష్కరించిన మోదీ

Sardar vallabhbhai patel s statue of unity inaugurated by pm modi in gujarat s kevadiya

gujarat goverment, Tourism, Statue of Unity, Sardar Vallabhbhai Patel, sardar, PM Modi, Kevadiya, Narmada River, sardar sarovar dam, hyderabad, congress first depury prime minister, iron man of India, amit shah, national news

The Statue of Unity, a 182-metre giant structure built in honour of Sardar Vallabhbhai Patel, has been inaugrated by PM Modi. The imposing monument, touted as the world's tallest statue, is twice the height of Statue of Liberty

ఉక్కుమనిషి ‘యూనిటీ విగ్రహం’ ఆవిష్కరణ

Posted: 10/31/2018 11:29 AM IST
Sardar vallabhbhai patel s statue of unity inaugurated by pm modi in gujarat s kevadiya

భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి, ఉక్కుమనిషిగా ఖ్యాతిగడించిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ మహా విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ  ఆవిష్కరించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్మారకార్థం ఆయన 143 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహాన్ని ప్రధాని ఇవాళ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ పటేల్ కు ప్రధాని ఘన నివాళులు అర్పించారు. బీజేపీ చీఫ్ అమిత్‌ షా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నర్మదా జిల్లాలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో సాధు బెట్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ అవిష్కరణతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని కూడా గుర్తింపును పోందింది. దీంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టనుంది. ఈ విగ్రహ నిర్మాణంతో గుజరాత్ లోని సర్థార్ సరోవర్ డ్యామ్ తో పాటు నర్మదా జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు. 2013 అక్టోబర్‌ 31 గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో మోదీ ఈ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

దాదాపు 182 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినదిగా రికార్డు సొంతం చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఇది రెట్టింపు ఎత్తులో ఉంటుంది. సర్థార్ సరోవర్ డ్యామ్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయడంలో భాగంగా 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సరోవర్ డ్యామ్ తో పాటు చుట్టుపక్కల ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

దాదాపు 30 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో పటేల్ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 37 మంది పటేల్ కుటుంబీకులు పాల్గొన్నారు. పటేల్‌ జయంతి, విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అన్ని జిల్లాల్లో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక నర్మదా జిల్లాలోని గిరిజనులు ఆందోళన చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles