Fuel prices witness downward trend వరుసగా 13వ రోజు తగ్గిన ఇంధన ధరలు..

Petrol diesel prices today cut for 13th day in a row

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

The oil marketing companies (OMCs) cut the petrol and diesel prices for the 13th straight day on Tuesday amid softening global crude prices.

వరుసగా 13వ రోజు తగ్గిన ఇంధన ధరలు..

Posted: 10/30/2018 02:22 PM IST
Petrol diesel prices today cut for 13th day in a row

రెండు మూడు నెలల పాటు ఏకధాటిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా గత 12 రోజుల నుంచి కిందకు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెల రోజులకు ముందు ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లిన ఇంధన ధరలు ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా 13వ రోజు కూడా తగ్గిన ఇంధన ధరలు ఆరు వారాల కనిష్టానికి చేరాయి.

మంగళవారం కూడా ఇంధన సంస్థలు ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఇండియన్ అయిల్ సంస్థ సహా అన్ని పెట్రోలుపై 20 పైసలు, డీజిల్‌ పై 7 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు లు వెల్లడించాయి. అయితే పది రోజల క్రితం వరకు తొంబై రూపాయల దరిదాపుల్లోకి చేరిన లీటరు పెట్రలు ధర.. ఇప్పడు క్రమంగా దిగివస్తుంది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 79.55కు, డీజిల్‌ ధర రూ. 73.78కు తగ్గింది.

 ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర. 85.04కు,  డీజిల్ ధర రూ. 77.32గా ఉంది. ఇక కోల్ కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.63కు, డీజిల్ ధర రూ . 75.70కు చేరగా, చెన్నైలో రూ. 82.86కు పెట్రోలు ధర, రూ. 78.08కి డీజిల్ ధర తగ్గింది. హైదరాబాద్‌ లో పెట్రోలు ధర రూ. 84.33గా, డీజిల్ ధర రూ.80.25గా ఉండగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 83.47, డీజిల్‌ ధర రూ. 79కి తగ్గింది. సమీప భవిష్యత్తులో ఈ ధరలు మరింతగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles