Pak 'Misrepresenting' Protest by Kashmiri Pandits ప్రభుత్వాలు, పాలకులు మారినా.. మారని పాక్ వ్యూహం..

Pakistan goofs again kashmir stamps show victims of its own terror

united nations, terrorism, Sushma Swaraj, Shah Mehmood Qureshi, Kashmiri Pandit, urdu, kashmir, Imran Khan, Human rights, Hizbul Mujahideen

Pakistan has issued postal stamps claiming “atrocities in Indian occupied Kashmir”, which has been termed as misleading by a Kashmiri Pandit group.

ప్రభుత్వాలు, పాలకులు మారినా.. మారని పాక్ వ్యూహం..

Posted: 10/03/2018 12:27 PM IST
Pakistan goofs again kashmir stamps show victims of its own terror

అక్కడ ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా.. తాము ఆచరించే విధానాలు, అనుసరించే వ్యూహాలలో మాత్రం ఏ కొంచెం కూడా మార్పు రావడం లేదు. నవాబ్ షరీప్ నుంచి ఇమ్రాన్ ఖాన్ వరకు అందరూ అవే వ్యూహాలను అచరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదో మార్పు వస్తుందని ఆశించిన మన నేతలు కూడా అక్కడకు వెళ్లి మరీ ఆ ప్రభుత్వాలకు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపినా.. వారి అనుసరించే విధానాలలో మార్పులు మాత్రం కనబడటం లేదు.

నవాజ్ షరీఫ్ ప్రధానిగా వున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్ తో సత్పంబంధాలను ఏర్పర్చుకోవాలని తన విదేశీ పర్యటనలో అకస్మిక మార్పులను చేసుకుని మారీ షరీప్ మనవరాలి వివాహానికి లాహోర్ వెళ్లి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన తల్లికి భారత్ నుంచి గాజలు, వేసవికాలంలో అందే అమృతఫలం మామిడి పళ్లను కూడా షరీఫ్ కుటుంబానికి పంపి.. వారితో సఖ్యతను ఏర్పాటుకు ఓ మెట్టు దిగారు. ఇక మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి పంజాబ్ మంత్రి సిద్దూ కూడా ఆయనకు అందిన ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా హాజరయ్యారు.

పాకిస్థాన్ తో తాము సఖ్యతను ఏర్పర్చుకోవాలని, భారత్ ఎన్ని మెట్లు దిగినా.. పాకిస్థాన్ మాత్రం తాము భారత్ పట్ల అనుసరించే విధానాలను ఏట్టి పరిస్థితుల్లో మార్చుకోవడం లేదు. ఫలితంగా భారత్‌ను ఇరికించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. కశ్మీర్‌లో భారత్ అత్యాచారాలకు పాల్పడుతోందని, పౌరులను హింసిస్తోందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. 20 పోస్టల్ స్టాంపులున్న 20 వేల షీట్లను ముద్రించింది. కశ్మీర్ ప్రజలపై భారత్ అరచకాలకు పాల్పడుతోందని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించింది.

అయితే, పొరపాటున పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు ఆందోళన చేస్తున్న ఫొటోలను కూడా స్టాంపుల్లో ముద్రించింది. ఇది కూడా భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తంతుగానే పాకిస్తాన్ సృష్టించే ప్రయత్నం చేసింది. మసి పూసి మారేడు కాయను చేయడం తేలికే అయినా.. అది ఎంతో సేపు నిలవదన్న విషయం తెలియని పాక్.. కాశ్మీర్ పండితులు చేసిన అందోళనపై.. కశ్మీర్ త్వరలోనే పాకిస్థాన్ అవుతుంది అని ఉర్దూలో రాసుకొచ్చింది. ఈ పోస్టల్ స్టాంపు చూసిన రూట్స్ ఇన్ కశ్మీర్ (ఆర్ఐకే) అనే సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌కు లేఖ రాసింది.

పాకిస్థాన్ స్పాన్సర్డ్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్ పండిట్లు చేస్తున్న ఆందోళనను పాకిస్థాన్ తన స్టాంపులపై ముద్రించుకుందని, ఇప్పటికైనా పాక్ దురాగతాను గుర్తించాలని కోరింది. ఆరేడేళ్ల క్రితం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కశ్మీర్ పండిట్లు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్పటి ఫొటో అదని ఐరాసకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ విషయంలో కలుగజేసుకుని పాకిస్థాన్ ఆ స్టాంపులను ఉపసంహరించుకునేలా ఆదేశించడంతోపాటు కశ్మీరీ పండిట్లకు క్షమాపణ చెప్పించాలని ఆర్ఐకే డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : united nations  terrorism  Sushma Swaraj  Shah Mehmood Qureshi  Kashmiri Pandit  urdu  kashmir  

Other Articles