Chandra Babu delivers his key speech at the UNఐక్యరాజ్య సమితిలో తెలుగు.. చంద్రబాబు వెలుగు..

Chandra babu delivers his key speech at the uno forum chandra babu naidu updates

Chandra Babu Naidu, CBN, AP updates, AP latest, Andhra Pradesh latest news, Andhra Pradesh farmers, Chandra Babu at UNO, Chandra Babu speech at UNO, Chandra Babu at UNO new updates, Chandra Babu at UNO highlights

Chandra Babu delivers his key speech at the UNO Forum: Babu has been asked to speak on ‘Financing Sustainable Agriculture/Landscape: Global Challenges and Opportunities'.

ఐక్యరాజ్య సమితిలో తెలుగు.. చంద్రబాబు వెలుగు..

Posted: 09/25/2018 03:25 PM IST
Chandra babu delivers his key speech at the uno forum chandra babu naidu updates

రైతులకు ఖర్చును తగ్గించి చీడపీడల లేని కాలుష్య రహిత సాగును ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐరాస సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు.

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక-బ్లూంబెర్గ్‌ నిర్వహించిన ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావం’ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles