Jain monk Tarun Sagar dies at 51 జైనుల గురువు తరుణ్ సాగర్ శివైక్యం..

Jain muni tarun sagar dies after prolonged illness pm modi condoles

tarun sagar ji maharaj, Tarun Sagar, Tarun Kumar Sagar, Rajnath Singh, Kadve Vachan, Jain community, Digambara monk, PM Modi

Internationally acclaimed Jain muni Tarun Sagar was most popular for his lecture series called "Kadve Pravachan", died after a prolonged illness in the wee hours on Saturday in the national capital. He was suffering from jaundice and other ailments.

జైనుల గురువు తరుణ్ సాగర్ శివైక్యం..

Posted: 09/01/2018 12:35 PM IST
Jain muni tarun sagar dies after prolonged illness pm modi condoles

జైన సాధువు తరుణ్ సాగర్ శనివారం ఉదయం 3 గంటలకు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా కామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తూర్పు ఢిల్లీలోని రాధాపురి జైన ఆలయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆయన 20 రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక.. ఆయన మందులు తీసుకోవడం మానేశారు. సల్లేఖిని వ్రతం ద్వారా ఆహారం ముట్టుకోకుండా ఆయన ప్రాణత్యాగం చేశారని తెలుస్తోంది.

1967 జూన్ 26న తరుణ్ సాగర్ జన్మించారు. ఆయన అసలు పేరు పవన్ కుమార్ జైన్. 13వ ఏటే ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. కడ్వే ప్రవచన్ పేరిట ఆయన ఇచ్చే ప్రసంగాలు ప్రాచుర్యం పొందాయి. ఆయన మరణం పట్ల ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఆయన శివైక్యం కావడంతో జైన సమాజం తమ గురువును కోల్పోయిందని అవేదనను వ్యక్తం చేశారు.

మోదీ, సురేశ్ ప్రభు, హర్యానా సీఎం ఖట్టర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితరులకు దిగంబర సాధువైన తరుణ్ సాగర్ అంటే అపారమైన గౌరవం. హర్యానా అసెంబ్లీలో ప్రసంగించడానికి ఆహ్వానం రావడంతో ఆయన వార్తల్లో నిలిచారు. హర్యానా అసెంబ్లీలో ఆయన ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతుండటం, పాకిస్థాన్ వ్యవహార శైలి, రాజకీయ నాయకుల గురించి మాట్లాడారు. రేపిస్ట్ బాబాలను ఒసామా బిన్‌ లాడెన్‌తో పోల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tarun Sagar  Rajnath Singh  Kadve Vachan  Jain community  Digambara monk  PM Modi  

Other Articles