EPS pays last respects to Karunanidhi గో బ్యాక్ నినాదాల మధ్య కరుణానిధికి పళనిస్వామి నివాళులు

Cm palaniswamy pays last respects to karunanidhi amid go back slogans

M Karunanidhi, Karunanidhi, Merina beach, Palanisamy, AIADMK, TN Government, DMK, Madras High Court, AIADMK, PM Modi, Nirmala Sitharaman, Mamta benerjee, kamal hassan, Rajini kanth, KCR, Congress, Madras High Court, AIADMK, Kalaignar, dmk, stalin, Rajini kanth, Kamal hassan, pawan kalyan, YS Jagan, tamil nadu

As the Tamil Nadu Government objected for DMK patriarch M Karunanidhi cremation at Merina Beach, the Madras High court grants permission, during the time of prevailing tensions TN CM Palanisamy came to Rajaji Hall to pay last respects amid slogans from DMK activist shouting go back.. go back.

గో బ్యాక్ నినాదాల మధ్య కరుణానిధికి పళనిస్వామి నివాళులు

Posted: 08/08/2018 01:33 PM IST
Cm palaniswamy pays last respects to karunanidhi amid go back slogans

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కళైంజ్ఞర్ కరుణానిధికి దేశంలోని రాజకీయ వేత్తలు, సాహితీవేత్తలు, సీనీ, నాటక రంగ ప్రముఖుల నుంచి సంతాపం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఆయన బౌతిక ఖాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా పలువురు మంత్రులకు రాజాజీ హాలు వద్ద చేధు అనుభవం ఎదురైంది. కరుణానిధి మంగళవారం పరమపదించిన క్రమంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ సీఎం పళనిస్వామి నివాసానికి వెళ్లి.. ఆయనను సమాచారాన్ని చేరవేసి.. తన తండ్రికి అధికార లాంఛనాలతో మెరినా బీచ్ లో ఖననం చేసేందుకు అనుమతించాలని కోరారు.

అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలిత అంత్యక్రియలు జరిగిన మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు చేయాలని డీఎంకే కోరారు. కరుణానిధి రాజకీయ గురువు అన్నాదురై సమాధి పక్కనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కాగా, అందుకు పళని సర్కార్ నిరాకరించిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రులను మెరినా బీచ్ లో ఖననం చేసేందుకు అభ్యంతరాలు వున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయస్థానంలో కూడా పలు కేసులు పెండింగ్ లో వున్నాయని, తాము ఒకవేళ అనుమతిచ్చినా తరువాత న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమవుతాయని కూడా చెప్పినట్లు సమాచారం.

దీంతో రాత్రికి రాత్రి జఠిలమైన ఈ సమస్యపైన అటు ప్రభుత్వం.. ఇటు డీఎంకే పార్టీలు మద్రాసు హైకోర్టును అశ్రయించాయి. ఈ క్రమంలో ఒకవైపు న్యాయస్థానంలో ఇరువర్గాల వాదనలు కొనసాగుతున్న క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తనకు అందుబాటులో వున్న సహచర మంత్రులతో కలసి చెన్నైలోని రాజాజీ హాల్ కు చేరుకుని రాజకీయ కురువృద్దుడు.. ధురంధరుడు కరుణానిధి బౌతికఖాయానికి ఘనంగా నివాళులు అర్పించేందుకు చేరుకున్నారు.

దీంతో వారిని చూసి చూడగానే డీఎంకే కార్యకర్తలు, అభిమానులు వారికి వ్యతిరేకంగా గో బ్యాక్, గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ నేతను కడసారి వీక్షించేందుకు వచ్చిన అసంఖ్యాకమైన కార్యకర్తలు పళనిస్వామిని అక్కడికి రావద్దని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి పట్ల తమకున్న వ్యతిరేకతను డీఎంకే కార్యకర్తలు ఇలా చూపారు. రాజాజీ హాల్ కు వచ్చిన పళనిస్వామి, కరుణ భౌతికకాయానికి నివాళులు అర్పించి, అక్కడి నుంచి వెంటనే వెనుదిరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karunanidhi  Merina beach  Palanisamy  AIADMK  TN Government  DMK  Madras High Court  AIADMK  tamil nadu  

Other Articles