Pawan Kalyan constitutes political affairs committees జనసేన కమిటీల ఏర్పాటు.. హరిప్రసాద్ కు అదనపు బాధ్యతలు

Pawan kalyan constitutes political affairs committees

pawan kalyan, janasena, Pawan Kalyan Yatra, dilip byra, madasu gangadharam, thota chandrashekar, haribabu, state co-ordinators for district teams, political affairs committee, pawan kalyan porata yatra, jana sena press meet, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Pawan Kalyan has constituted Jana Sena party's political affairs committee. P Hari Prasad, who is already the party's media head, has been appointed as Pawan's political secretary. Madasu Gangadharam is the convenor.

జనసేన కమిటీల ఏర్పాటు.. హరిప్రసాద్ కు అదనపు బాధ్యతలు

Posted: 07/24/2018 11:40 AM IST
Pawan kalyan constitutes political affairs committees

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ధీటుగా ఎదుర్కోనేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సమాచారం నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తలో విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అధికార టీడీపీ ధర్మపోరాటదీక్షలతో ప్రజల్లోకి వెళ్లగా, విపక్ష వైసీపీ అధినేత ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోనే అధిక సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో మూడవ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ వామపక్ష పార్టీల మద్దతుతో కలసి ఎన్నికలలో పోటీకి సిద్దం అవుతుంది.

ప్రస్తుతం ఉత్తరాంధ్ర పోరాటయాత్రతో బిజీగా వున్న పవన్ కల్యాణ్.. ఆ తరువాత రాయలసీమలోనూ పర్యటించనున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా పవన్ బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఇక ఆయన పర్యటనలతో బిజీగా వున్నా.. క్షేత్రస్థాయి నుంచి పార్టీ వ్యవహరాలు అన్ని సిద్దం చేసేందుకు పవన్ కల్యాణ్ కూడా పలు కమిటీలు వేసి కమిటీలు వేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయి నుంచి పార్టీని రాష్ట్రవ్యాప్తంగా పటిష్టం చేసే దిశగా కార్యచరణను చేపట్టింది. బూత్ స్థాయి నుంచి పార్టీకి పటిష్టమైన క్యాడర్ ను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రస్తుతం వున్న కమిటీలలో పలు మార్పులు చేసి.. పలు కమిటీలకు కన్వీనర్లను, సభ్యులను నియమించారు. రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు రాష్ట్ర సమన్వయకర్తల్నిపవన్ కల్యాణ్‌ నియమించారు. పార్టీకి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకోవడంలో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటికీ పవన్ కల్యాణ్‌ ఛైర్మన్ గా వ్యవహరిస్తుండగా, మాదాసు గంగాధరం కన్వీనర్ గా కొనసాగనున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో తోట చంద్రశేఖర్, అర్హం యూసఫ్, మరిశెట్టి రాఘవయ్యకు చోటు కల్పించారు. పార్టీ మీడియా ఇంఛార్జిగా కొనసాగిన హరిప్రసాద్ ఇక నుంచి జనసేనానికి రాజకీయ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలతో వ్యవహరించనున్నారు.

Janasena Committee Members(Image Source: Twitter.com/JanaSenaParty)

జనసేన అధికార ప్రతినిధిగా మాజీ సమాచార కమిషనర్ విజయబాబు, లీగల్ సెల్ అధ్యక్షుడిగా చిదంబరం నియమితులయ్యారు. జిల్లా స్థాయిలో వ్యవహారాలు చూసేందుకు 15మంది సమన్వయకర్తల్ని నియమించారు. ఈ కమిటీకి పార్థసారథి కన్వీనర్ గా వ్యవహరిస్తుండగా, డాక్టర్ సునిధి, యశశ్వని, సుజాత పాండా, సయ్యద్ బాబు, తిరుపతిరావు గద్దె, డాక్టర్ హరిప్రసాద్, పి.రవికుమార్, బైరా దిలీప్, రాథాకృష్ణమూర్తిలు సమన్వయకర్తలుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బూత్ కమిటీల ఏర్పాటు సమన్వయం కోసం ఐదుగురితో కమిటీ వేశారు. ఈ బృందానికి షేక్ రియాజ్ కన్వీనర్ గా వ్యవహరించనుండగా, యర్నాగుల శ్రీనివాస్, వరుణ్, సురేశ్ చింతా, సతీష్ కుమార్ వన్నెంరెడ్డిలు సభ్యులుగా కొనసాగనున్నారు.

విజయవాడలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను పార్టీ కన్వీనర్ మాదాసు గంగాధరం మీడియాకు వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోరాటయాత్రల అనంతరం రాయలసీమలోనూ పవన్ పర్యటిస్తారని తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చర్యలు మొదలయ్యాయని తోట చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో ఇప్పటికే 25లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారని, కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేది పవన్ ఆలోచన అని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh