Rape accused to lose licence in Haryana అత్యాచార నిందితులకు అన్ని ప్రభుత్వ పథకాలు కట్..

Rape accused to lose driving licence pensions other govt facilities in haryana

rape accused, rape case haryana, haryana rape accused, Haryana, Rape accused Haryana, Manohar Lal Khattar, Haryana, crime

The accused in rape and molestation cases in Haryana will now be debarred from government facilities like driving licence, arms licence, old age pension, pension for the physically disabled persons.

అత్యాచార నిందితులకు అన్ని ప్రభుత్వ పథకాలు కట్..

Posted: 07/13/2018 10:49 AM IST
Rape accused to lose driving licence pensions other govt facilities in haryana

అత్యాచార భారతం.. అబలలకు కాదు సురక్షితం.. అంటూ ఓ వైపు స్వదేశంలో విమర్శలు వస్తుండగా.. మరోవైపు విదేశీయులను ఆయా దేశాలు కూడా భారత పర్యటనలో అప్రమత్తంగా వుండాలని సూచనలు చేస్తూ.. భారత్ లో విహారాలకు వెళ్లకపోవడమే సముచితం అంటూ కూడా అదేశాలను జారీ చేస్తున్న క్రమంలో దిద్దుబాటు చర్యలకు దిగుతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. మరీ ముఖ్యంగా ఉత్తరభారతంలో పేట్రేగిపోతున్న కామాంధులు.. ఈ తరహా ఘటనలను అటు సోషల్ మీడియాలో కూడా పోస్టు చేస్తుండటంతో.. యావత్ ప్రపంచంలోనే భారత్ దేశానికి అపఖ్యాతి మూటగట్టుకుంటుంది.

యత్ర నార్యంతు పూజ్యంతే.. రమ్యతే తత్ర దేవతాం అన్న అడవారిని కూడా పూజించే సంస్కృతి కలిగిన దేశంలో అదే అడవారిపై జరుగుతున్న వికృతాలతో అపకీర్తి మూటగట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో నిందితుల డ్రైవింగ్, గన్ సహా వారికి ఉన్న అన్ని లైసెన్సులను రద్దు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. అత్యాచారానికి పాల్పడినా, లైంగికంగా వేధించినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వేధింపులకు పాల్పడిన వారు ఒకవేళ వృద్ధులు, దివ్యాంగులు అయితే ప్రభుత్వం నుంచి వారు అందుకుంటున్న పింఛన్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మహిళలందరి రక్షణ కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన సీఎం, పంద్రాగస్టున, లేదంటే రక్షాబంధన్ రోజున దానిని ప్రారంభించనున్నట్టు చెప్పారు. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ శిక్ష కోసం ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. అలాగే, అత్యాచార బాధితులు తమకు నచ్చిన లాయర్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. న్యాయవాది ఫీజు కింద రూ.22 వేలను చెల్లిస్తుందని సీఎం ఖట్టర్ తెలిపారు. అయితే సార్వత్రిక ఎన్నికలు ఆ తరువాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో ఇలాంటి చర్యలను చేపట్టి ఓటర్లను అకర్షిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles