Swami Paripoornananda's house arrest continues స్వామి పరిపూర్ణానందకు పోలీసుల నోటీసులు

Hyderabad police issues notices to sri peetam seer swami paripoornananda

paripoornanada swamy house arrest, paripoornanada swami kathi mahesh, paripoornanada swami dharmagraha yatra, kathi mahesh hyderabad police, kathi mahesh paripoornanada swamy, kathi mahesh bigboss, kathi mahesh controversial remarks, kathi mahesh twitter, paripoornanada swamy, kathi mahesh, rachakonda police, law and order, controversial remarks

Sri Peetam Swami Paripoornananda’s house arrest continued for the second consecutive day at his residence. Police have denied the Swami from taking up the three-day ‘Darmika Chaitanya Yatra’ which was supposed to take off from Shiva Temple at Bodduppal to Yadadri

స్వామి పరిపూర్ణానందకు పోలీసుల నోటీసులు

Posted: 07/10/2018 01:23 PM IST
Hyderabad police issues notices to sri peetam seer swami paripoornananda

ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందకు హైదరాబాద్ పోలీసులు ఇవాళ నోటీసులు అందజేశారు. రెండో రోజున కూడా ఆయన గృహనిర్భంధం కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఆయన యాత్రకు బయలుదేరే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఆయనకు నోటీసులను అందజేశారు. సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ నోటీసులు అందజేసిన నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి యాత్రకు బయలుదేరితే అరెస్టు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఇంటి దగ్గరే పరిపూర్ణానంద స్వామి దీక్ష చేస్తున్నారు. ప్రతి మతానికి ఉనికి ఉంటుందని దానిని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని పరిపూర్ణానంద స్వామి అన్నారు. కొంత మంది వ్యక్తులు హిందు ధర్మంపై అవహేళనగా మాట్లాడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపూర్ణానంద స్వామిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఇవాళ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు.

మతాల ఉనికిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న బాబు గోగినేనిది దుర్మార్గపు భావజాలమని స్వామి పరిపూర్ణానంద అన్నారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణమన్నారు. భావప్రకటన  స్వేచ్ఛ పేరుతో కులాలు, మతాలను కించపరిచేలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అభ్యంతరకర వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హృదయాలు గాయపడ్డాయని పరిపూర్ణానంద చెప్పారు. ఏ కులమూ తక్కువ కాదు, ఏ కులమూ ఎక్కువ కాదని, మతాలు, కులాలు అన్నీ ఒక్కటేనని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paripoornanada swamy  kathi mahesh  dharmagraha yatra  hyderabad police  law and order  

Other Articles