10 percent of votes will bring janasena into power అధికారంలోకి రావాలంటే పది శాతంతోనే ప్రారంభం: పవన్

10 percent of votes will bring janasena into power pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan, vishakapatnam, pawan kalyan pendurthi, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who is in vishakapatnam says if 10 percent of votes make modi PM and trump American president why not that bring jana sena into power

అధికారంలోకి రావాలంటే పది శాతంతోనే ప్రారంభం: పవన్

Posted: 07/04/2018 09:11 PM IST
10 percent of votes will bring janasena into power pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలోని పెందుర్తిలో నిర్వహించిన బహిరంగసభలో దళితుల కోసం గళం విప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., నాలుగేళ్ల కాలంలో పెందుర్తిలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ కూడా పెట్టలేకపోయారు. రైతుల భూములను దోపిడీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు వాటిని అడ్డుకోవాల్సింది పోయి భూ కబ్జాదారులకు అండగా ఉన్నారు. పోనీ వైసీపీ నాయకులు అండగా ఉంటారా అంటే తమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయండని, ప్రజల సమస్యలు తీరుస్తామని అంటున్నారు" అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ... "అందరూ అనుకుంటున్నారు.. జనసేనకి బలం ఎక్కడుందని కొంత మంది ప్రశ్నించారు.. ఇంత మంది ఇక్కడకు వచ్చారు.. ఇది మన బలం కాకపోతే మరేంటో చెప్పండి.. మొదట కొందరు జనసేన ఐదు సీట్లు గెలుచుకుంటుందన్నారు.. జనసేనకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని అన్నారు. మళ్లీ ఇటీవల జనసేనకి పది శాతం ఓట్లు వస్తాయని అంటున్నారు. మరీ ఎంత శాతం వస్తాయన్నది మీరే వారికి ఎన్నికలలో చాటిచెప్పాలని పవన్ అభిమానులకు పిలుపునిచ్చారు.

పది శాతం అంటే తక్కువని.. వీరు అధికారంలోకి ఎలా వస్తారని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. అయితే నరేంద్ర మోదీ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించి దేశానికి ప్రధాని అయ్యారని.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పది శాతం ఓట్లతోనే ప్రారంభించి అమెరికా అధ్యక్షుడయ్యారు. మేము కూడా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కల్యాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే అధికారం కోసమే మాత్రం తాము పాకులాటం లేదని, క్షేత్రస్థాయిలో ప్రజల అభ్యున్నతి కోసమే తాము అమితంగా అలోచిస్తున్నామని జనసేనాని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  vishakapatnam  pendurthi  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles