DS Arvind gives befitting reply to TRS MP Kavitha ఎంపీ కవిత వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపి నేత అరవింద్..

Ds arvind gives befitting reply to trs mp kavitha

TRs leaders, D Srinivas, nizambad, disciplinary action, BJP, d arvind, d srinivas, ds, k chandrashekhar rao, k kavitha, TRS advisor, rajya sabha member, politics

After Nizamabad TRS leaders including MP, MLAs and others along with Kavitha demanded Chief Minister and Party Chief KCR to take disciplinary action against the Rajya Sabha member D Srinivas, BJP Leader and son of DS, Arvind gives reiterate reply.

ఎంపీ కవిత వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపి నేత అరవింద్..

Posted: 06/28/2018 02:20 PM IST
Ds arvind gives befitting reply to trs mp kavitha

నిజామాబాద్ ఎంపీ.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవితకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీనియర్ నేత డీఎస్ తనయుడు అరవింద్. అధికార పార్టీ తన తండ్రిని టార్గెట్ చేసి కాకరేపుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన కవిత.. డీ.శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడిపై కూడా అరోపణలు చేసిన విషయం తెలిసిందే. జిల్లా నేతలంతా భగ్గుమనడం.. ఎంపీ కవిత కూడా టార్గెట్ చేయడంతో మరింత ముదిరి ఈ వ్యవహారంపై బీజేపి నేత డీఎస్ అరవింద్ ఇవాళ కవిత వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు.  

డీఎస్ తన కుమారుడు అరవింద్ భవిష్యత్ కోసం బీజేపీ నేతలకు మోకరిల్లారంటూ అమె చేసిన వ్యాఖ్యలపై అరవింద్ మాట్లాడుతూ.. ‘కవిత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను తమ తండ్రి బీజేపీలోకి పంపారన్న మాట పూర్తిగా అవాస్తవమని చెప్పుకోచ్చారు. కవితలా తాను తన తండ్రినో లేక తన అన్ననో అధారంగా చేసుకుని రాజకీయాల్లో ప్రభావం చాటడానికి రాలేదని అన్నారు. మీది పూర్తిగా కుటుంబపార్టీ అని విమర్శించిన ఆయన తాను ఎవరిపై ఆధారపడి లేనని స్ఫష్టం చేశారు. తాను ముందు నుంచి బీజేపీకి మద్దతుగా ఉన్నానని... ఇందులో తన తండ్రి ప్రమేయం లేదని చెప్పారు. ప్రధాని మోదీ కోసం తాను ప్రాణమిస్తానని తెలిపారు. నిజామాబాద్ ఎంపీగా గత నాలుగేళ్లుగా కవిత చేసిన అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘నన్ను నియంత్రించడానికి మా కుటుంబంలో నాన్న డిక్టేటర్ కాదు.. నేనేమీ బానిసను కాదు. రాజకీయంగా నేనెప్పుడూ నాన్న సహాయం తీసుకోలేదు. ఎవరి రాజకీయ వారివి. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు.. ఆయన అన్న రాజేశ్వర్‌రావు బీజేపీ, సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పని చేశారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేముంది. నేను పొలిటికల్‌గా ఎదగాలని ఉంటే 2004లోనే ఎదిగేవాడ్ని. రాజకీయాల్లో కుటుంబాల గురించి మాట్లాడకూడదన్న అవగాహన ఎంపీ కవితకు లేకపోవడం దారుణం. బీజేపీని వీడేది లేదు’అని తేల్చి చెప్పారు అరవింద్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : D Arvind  D Srinivas  BJP  d arvind  k chandrashekhar rao  k kavitha  nizambad  politics  

Other Articles