Congress targets govt over note ban ‘‘నోట్ల రద్దు పెద్ద కుంభకోణమే.. ధర్యాప్తు చేయాలి’’

Congress claims note ban as a biggest scandal accused amit shah

Demonetisation scam, Ahmedabad District Cooperative Bank, Amit Shah, Amit Shah bank, congress, rahul gandhi, Bharatiya Janata Party, BJP, Demonetisation, Gujarat, Narendra Modi, note ban, amit shah, demonetisation, randeep surjewala, collection of banned currency, biggest scam, Ahmedabad, Gujarat

Congress leader Randeep Surjewala claimed that Ajay Patel, the chairman of Ahmedabad District Cooperative Bank (ADCB) which mobilised Rs 745.58 crore worth of banned notes in just four days in 2016, is a “close associate” of BJP president Amit Shah.

‘‘నోట్ల రద్దు పెద్ద కుంభకోణమే.. ధర్యాప్తు చేయాలి’’

Posted: 06/23/2018 05:29 PM IST
Congress claims note ban as a biggest scandal accused amit shah

నోట్ల రద్దు వ్యవహారం పెద్ద కుంభకోణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం వుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీఫ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌గా ఉన్న అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకులో పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 750 కోట్లకు పైగా జమ అయిన వ్యవహారంపై ఆయన విమర్శలు గుప్పించారు. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చేందుకే పెద్ద నోట్ల రద్దు చేశారని దీని ద్వారా నిరూపితమైందని అన్నారు.

స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద కుంభకోణం పెద్ద నోట్ల రద్దేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా అనేమంది రాజకీయ నేతలు, ఆర్థిక నిపుణులు ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నోట్లరద్దు వ్యవహారంపై దర్యాప్తు జరపించాలని సూర్జేవాలా డిమాండ్‌ చేశారు. అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంకు నోట్ల రద్దును నోట్ల మార్పిడి వ్యాపారంగా మార్చేసిందని మండిపడ్డారు.

బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతల ఆధీనంలో ఉన్న బ్యాంకుల్లో నోట్ల రద్దు తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే 14,300 కోట్లు జమ అయ్యాయన్నారు. నోట్ల రద్దు మాటున నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్లే నోట్ల రద్దు కుంభకోణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తునన్నామని అన్నారు. ఈ వివరాలు వెలుగులోకి రాగానే రాహుల్ గాంధీ.. అమిత్ షాకు కంగ్రాట్స్ చెప్పి మరీ ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles