TV Anchor Tejaswini Found Dead In Suspicious Manner న్యూస్ రీడర్ తేజశ్విని అనుమానాస్పద మృతి

Tv anchor tejaswini found dead in suspicious manner

TV Anchor, News Reader Tejaswini, vijayawada news reader, vijayawada tv anchor, news reader tejashwini suspicious death, tv anchor tejashwini suspicious death, tv anchor, news reader, tejaswini, pavan kumar, local channel, eedupugallu, mbvr colony, vijayawada, crime

A local TV news channel reporter Tejaswini is found dead committing suicide in a suspicious manner. The incident took place in Eedupugallu, MBVR Colony of vijayawada

న్యూస్ రీడర్ తేజశ్విని అనుమానాస్పద మృతి

Posted: 06/18/2018 03:07 PM IST
Tv anchor tejaswini found dead in suspicious manner

కుటుంబ కలహాల కారణంగా ఓ టీవీ యాంకర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన తేజస్విని ఓ న్యూస్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే తన గదిలో ఫ్యానుకు తాడుతో ఉరివేసుకుని అమె మరణించింది. కాగా, తేజస్వీ మరణాన్ని అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అమె మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజశ్వినికి.. బజాబ్ రిలయన్స్ లో పని చేసే పవన్ కుమార్ కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఓ పాప కూడా వుంది. భర్త పవన్ కుమార్ షిరిడీకి వెళ్లిన రోజు సాయంత్రం తేజశ్వినికీ.. అమె అత్త అన్నపూర్ణమ్మతో ఏదో విషయంలో మాటా మాటా పెరిగింది. దీంతో అవేశంగా తన గదిలోకి వెళ్లిన తేజశ్విని ఎంతకీ భయటకు రాలేదు. తనపై అలిగిందని అత్త కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే రాత్రి బోజనాల సమయంలో కూడా బయటకు రాకపోవడంతో అందోళన చెందిన అన్నపూర్ణమ్మ తేజశ్విని గదికి వెళ్లింది.

గది గడియపెట్టి వుండటంతో కిటీకీ తెరచి చూసిన అన్నపూర్ణమ్మకు గుండెఅగింది. తన కోడలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలుసుకుని గుండెలవిసేలా ఏడ్చింది. స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించడంలో వారు వచ్చి ఫ్యాన్ కు వేలాడుతూ తేజశ్విని మృతదేహాన్ని కిందకు దించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv anchor  news reader  tejaswini  pavan kumar  local channel  eedupugallu  mbvr colony  vijayawada  crime  

Other Articles