Etela fined Rs 2,300 by the court నేరం అంగీకరించిన ఈటెల.. జరిమానా విధించిన కోర్టు

Ts finance minister etela fined rs 2 300 by the court

Finance Minister, Telangana finance minister, TRS leader, Telangana movement, Etela Rajender, Huzurabad, Rail Roko’, Uppal Railways Station, Warangal, fine, Kazipet Railway Court, justice P Srivani, Karimnagar, Telangana

Finance Minister for Telangana Government Etela Rajender has been fined Rs 2,300 by Kazipet Railway Court Judicial First Class Magistrate P Srivani.

నేరం అంగీకరించిన ఈటెల.. జరిమానా విధించిన కోర్టు

Posted: 05/25/2018 10:14 AM IST
Ts finance minister etela fined rs 2 300 by the court

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్యమంలో భాగంగా తాము నేరానికి పాల్పడాల్సి వచ్చిందని తెలిపారు. ఈటెల వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. అతనికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇదే తప్పును రెండు పర్యాయాలు చేసిన నేపథ్యంలో రెండు పర్యాయాలకు కలసి జరిమానాను విధించింది న్యాయస్థానం. తెలంగాణ మంత్రివర్యులుగా వున్న ఈటెల ఏం నేరం చేశారు.. దానిని అంగీకరించడం ఏంటీ అంటారా.. విషయంలోకి ఎంటైర్ అయితే..

తెలంగాణ ఉద్ధృతంగా సాగుతున్న వేళ, అప్పటి వరంగల్‌ జిల్లా ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ లో నిరసనలు తెలిపిన కేసుల్లో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ కు రూ. 2,300 జరిమానా విధిస్తున్నట్టు కాజీపేట రైల్వే కోర్టు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ పి శ్రీవాణి తీర్పిచ్చారు. ఉద్యమంలో భాగంగానే రైళ్లను అడ్డుకున్నామని, తాను చేసింది తప్పేనని ఈటల న్యాయమూర్తి ముందు అంగీకరించడంతో ఈ తీర్పు చెప్పారు. 2009, డిసెంబర్ 6న చేసిన రైల్ రోకోలో రూ. 1,500, 2012, సెప్టెంబర్ 7న చేసిన రైల్ రోకో కేసులో రూ. 800 జరిమానాగా విధిస్తున్నట్టు తీర్పిచ్చారు. ఈ కేసులో మరికొందరిపైనా ఇంతే మొత్తాన్ని జరిమానాగా విధిస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etela Rajender  Huzurabad  rail roko  fine  railway court  karimnagar  telangana movement  

Other Articles