Siddaramaiah suggests PM, to stop lecturing against corruption ప్రధాని మోడీకి సిద్దు సూచన.. అవినీతిపై ఇక మాటలు వద్దూ..

Does pm modi have moral courage to advice bjp to stop attempt to bribe mlas siddaramaiah

siddaramaiah, PM Modi, corruption, yeddyurappa, resign, audio tape, poaching mla, sri ramulu, congress, JDS, priyanka chaturvedi, karnataka, politics

Siddaramaiah who was vocal during the campaign trail tweeted asking PM Modi to refrain Karnataka BJP leaders from indulging in horse trading.

ప్రధాని మోడీకి సిద్దు సూచన.. అవినీతిపై ఇక మాటలు వద్దూ..

Posted: 05/19/2018 03:51 PM IST
Does pm modi have moral courage to advice bjp to stop attempt to bribe mlas siddaramaiah

కర్ణాటకలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు.. ప్రలోభాలు.. వాటికి సంబంధించిన అడియో టేపులు కూడా వెలుగులోకి రావడంతో.. తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవినీతి కనబడకుండా చేస్తాం అని ప్రగల్భాలు పలికే ప్రధాని.. అవినీతిపై గంటల తరబడి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రధాని.. ఇప్పుడు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో బీజేపి ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేస్తున్నది ఏమీటి.. బీజేపి శ్రేణుల అధ్వర్యంలో జరుగుతున్నది ఏమిటి? అని ప్రశ్నించారు.

ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సిద్ధరామయ్య విరుచుకు పడ్డారు. ఈ సమయంలో.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా యడ్యూరప్పను, బీజేపీ నేతలను అడ్డుకొనే నైతిక విలువలు మోదీకి ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. మోదీజీ... కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారా? అని పేర్కొన్నారు. ఇకపై ప్రధాని రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమాలలో, ఎన్నికల ప్రచార సభల్లో.. ఇలా అవకాశం కల్పించే ఏ వేదికపైన కూడా అవినీతి గురించి మాట్లాడకూడదని ఆయన సూచించారు.

సొంత పార్టీ నేతలు, బీజేపి శ్రేణులు, అందరూ కలసి కర్ణాటకలోని ఎమ్మెల్యేలతో బేరసారాలు అడుతున్న టేపులు కన్నడ రాష్ట్ర ప్రజలు చూశారని, ఒక్కో ఎమ్మెల్యేకు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామని బేరాలు కుదుర్చుకుంటున్నారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు మంత్రి పదవులు కూడా ఇస్తామని బేరాలు కుదుర్చుకుంటున్నారు. వారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. బీజేపి అధ్వర్యంలో ఇంత పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నా ప్రధానికి మాత్రం కనబడదని సిద్దరామయ్య వ్యంగస్త్రాలు సంధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles