Minister Ganta Srinivasa Rao meets MLA Kannababu గంటాతో చర్చలు విఫలం.. వైసీపీలో చేరుతానన్న కన్నబాబు

Minister ganta srinivasa rao meets mla kannababu

Yalamanchili Ex MLA, Kannababu, Congress, YSRCP, minister ganta srinivasa rao, Andhra Pradesh CM, chandrababu, Nara Lokesh andhra pradesh, politics

Yalamanchili Ex MLA Kannababu says he is fixed to join YSRCP, on may 5th, after holding a meet with minister ganta srinivasa rao, he alleges tdp chief and AP CM chandrababu and Nara Lokesh decived him in a interview

గంటాతో చర్చలు విఫలం.. వైసీపీలోకి కన్నబాబు పయనం

Posted: 04/28/2018 11:06 AM IST
Minister ganta srinivasa rao meets mla kannababu

టీడీపీలో తనకు అవమానం జరిగిందని, తన పార్టీ నేతలే తనను చిన్నచూపు చూశారని తీవ్రమనోవేదనకు గురైన యలమంచిలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కన్నబాబు అన్నారు. గత ఎన్నికల్లో యలమంచిలిలో టీడీపీ విజయం కోసం తీవ్రంగా కృషి చేసి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించానని చెప్పారు. కానీ టీడీపీ మాత్రం తనను చాలా చిన్నచూపు చూసిందని, అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి మోసం చేశారని కన్న బాబు ఆరోపించారు.

పార్టీ యువనాయకుడు నారా లోకేశ్ కూడా తనకు పలు హామీలు ఇచ్చి దారణంగా మోసం చేశారన్నారు. ఈ క్రమంలో తాను వైసీపీ పార్టీలో చేరడమే మేలని భావించి, తన అనూయాయువులతో కూడా చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మే 5న వైసీపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు.  ఈ విషయంలో భగవంతుడు దిగివచ్చి చెప్పినా వినేది లేదని తేల్చేసినా.. తుది ప్రయత్నాల్లో టీడీపీ పార్టీ బుజ్జగింపుల పర్వానికి తెరలేపింది.

ఈ ఉదయం ఆయన మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లారు. మంత్రి గంటా స్వయంగా కన్నబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీలోనే కొనసాగాలని కోరారు. అయితే అందుకు మాత్రం కన్నబాబు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా టీడీపీలోనే ఉండాలంటూ ఆయనకు గంటా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీలో కొనసాగలేనని గంటాకు కన్నబాబు స్పష్టం చేశారు.

భేటీ అనంతరం మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ, గంటా శ్రీనివాసరావును రాజకీయ కారణాలతో తాను కలవలేదని... ఆయన తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే 2014లో తాను టీడీపీలో చేరానని... అయితే, తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపిలో యలమంచిలి, పాయకరావుపేటలో వైకాపా గెలుపే లక్ష్యంగా పని చేస్తానని కన్నబాబు చెప్పారు. తన వయసు 65 సంవత్సరాలని... రాజకీయంగా ఇప్పుడు స్థిరపడకపోతే తన కుటుంబానికి గౌరవం కూడా ఉండదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles