Asaram gets lifetime in jail అత్యాచార కేసులో అసారాం బాపుకు జీవిత ఖైదు

Godsman asaram bapu sentenced to life until death in rape case

Asaram, Asaram convicted, Asaram guilty, life imprisonment, Asaram rape, Asaram rape case, Asaram rape case verdict, asaram bapu case verdict, asaram bapu verdict, asaram verdict, asaram bapu live news, asaram bapu today news, asaram update, asaram bapu news jodhpur, latest news about asaram bapu

Nearly five years after rape charges were levelled against self-styled godman, Asaram Bapu, the Jodhpur Schedule Caste and Schedule Tribe Court today awarded life imprisonment to Asaram till death, while the two other co-accused got 20-year term.

అత్యాచార కేసులో అసారాం బాపుకు జీవిత ఖైదు

Posted: 04/25/2018 08:18 PM IST
Godsman asaram bapu sentenced to life until death in rape case

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపునకు జోధ్‌పూర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు దోషులకు 20ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించిన తుది విచారణ జరగ్గా.. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ మధుసూదన్ శర్మ ఈ తీర్పు వెల్లడించారు. ఆశారాంకు జీవిత ఖైదు విధించడంతో ఆయన తన మిగతా జీవితం మొత్తం జైలులోనే గడపాల్సి ఉంటుంది.

ఆశారాంకు కనీస శిక్ష మాత్రమే విధించాలని ఆశారాం తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినా.. న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశారాం అధికార ప్రతినిధి తెలిపారు. ఆశారాం కేసు తొలుత న్యాయస్థానంలోనే విచారణ జరపాలని భావించినా.. గుర్మీత్ బాబాపై తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న అల్లర్లను దృష్టిలో ఉంచుకొని విచారణను జోధ్‌పూర్ జైలు ప్రాంగణంలో చేపట్టాలని రాజస్థాన హైకోర్టు ఆదేశించింది.

ఈ కేసుకు సంబంధించి గత నాలుగేళ్లుగా ఆశారాం ఇదే జైలులో ఉంటున్నాడు. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జోధ్‌పూర్ జైలు సహా రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని షాహజాన్ పూర్ కు చెందిన అత్యాచార బాధితురాలి ఇంటి వద్ద ఏడుగురు పోలీసులతో రక్షణ కల్పించారు.

మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో గల ఆశారాం ఆశ్రమంలో చదువుకుంటున్న బాలికపై ఆగస్టు 15, 2013న అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2013 సెప్టెంబరు 1న ఆశారాంను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 7నే వాదనలు పూర్తికాగా.. ఇవాళ తుది తీర్పు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : self styled godsman  asaram bapu  convicted  rape charges  life imprisonment  jodhpur court  crime  

Other Articles