PM Modi confronted by angry protests in London లండన్ పర్యటనలో ప్రధాని మోదీకి చేదు అనుభవం..

Modinotwelcome posters greet the indian pm on the first day of his uk visit

Britain, London, UK, Protesters, #ModiNotWelcome, United Kingdom, Amrit Wilson, South Asia Solidarity, BJP, Kathua, Kathua rape, Narendra Modi, Unnao, Unnao rape, BJP MLA, BJP ministers, Crime

A van with a digital poster of Prime Minister Narendra Modi moves around London on Wednesday, which was the first day of the Indian leader’s visit to the United Kingdom

లండన్ పర్యటనలో ప్రధాని మోదీకి చేదు అనుభవం..

Posted: 04/18/2018 06:29 PM IST
Modinotwelcome posters greet the indian pm on the first day of his uk visit

కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి చేదు అనుభవం ఎదురైంది. గత నాలుగేళ్ల పాటు ఆయన అనేక విదేశీ పర్యటనలు చేసినా.. అక్కడి జనం ప్రధాని మోడీకి నీరాజనం పట్టారు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఆయన లండన్ పర్యటనలో ఎప్పుడు లేని విధంగా నిరసనలు చవిచూడాల్సివచ్చింది. భారత్‌ను కుదిపేసిన కథువా హత్యాచార ఘటనను నిరసిస్తూ, ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు హక్కుల సంఘాలు ఇక్కడ ఆందోళనలు చేశాయి.

సౌత్‌ ఏసియా సాలిడారిటీ గ్రూప్‌ కు నేతృత్వం వహిస్తున్న అమ్రిత్ విల్సన్ ఆధ్వర్యంలో పలు వాహనాలపై పెద్దపెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి లండన్ నగర వ్యాప్తంగా మోడీ పర్యటించే ప్రాంతాల్లో వాటిని తిప్పుతూ నిరసనను వ్యక్తం చేశారు. వాటిపై ‘మోడీ నాట్‌ వెల్‌కమ్‌’,  ‘జస్టీస్ ఫర్‌ ఆసిఫా’ పోస్టర్లను ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా థేమ్స్‌ తీరంలోని బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎదుట, ఆయా పరిసర ప్రాంతాల్లో ఈ వాహనాలను తిప్పారు. బ్రిటన్ లో భారతీయ మహిళా సంఘాలు పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్ద మౌన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆందోళనల నేపథ్యంలో భారత ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో లండన్‌ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : London  UK  Protesters  #ModiNotWelcome  South Asia Solidarity  BJP  Kathua  Unnao  Crime  

Other Articles