Unnao gangrape: survivor's father dies in custody బీజేపి ఎమ్మెల్యే రేప్ కేసు: బాధితురాలి తండ్రి లాకప్ డేత్..

Unnao gangrape survivor s father dies in custody victim blames bjp government

UNNAO rape case, Atul sengar, Kuldeep Singh Sengar, Yogi Adityanath, rape, gang-rape, BJP MLA rape case, rape victim suicide attempt, rape victim father lockup death, uttarpradesh, crime

Atul Sengar, brother of BJP MLA Kuldeep Singh Sengar, has been arrested in connection with the Unnao gang-rape case. After the rape victim's father allegedly died in police custody on Monday. Three more persons have also been arrested in the case.

బీజేపి ఎమ్మెల్యే రేప్ కేసు: బాధితురాలి తండ్రి లాకప్ డేత్..

Posted: 04/10/2018 09:54 AM IST
Unnao gangrape survivor s father dies in custody victim blames bjp government

తనపై తమ ప్రజాప్రతినిధి తన సొదరుడితో కలసి అత్యాచారం చేశాడని అరోపిస్తూ.. ముఖ్యమంత్రి ఇంటి ఎదుట అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బాధిత యువతి పిర్యాదుపై పట్టని పోలీసులు అమె తంత్రిని మాత్రం కుట్ర, ఉద్దేశపూర్వకంగా అప్రతిష్ట పాలు చేయడం వంటి అరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని అన్యాయంగా పోట్టనపెట్టుకున్నారు. పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు పోలీసుల లాకప్ డెత్ చేశారని అరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశారంటూ.. అప్పటి నుంచి తాను ప్రతీ ఒక్క అధికారికి వారిపై పిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అరోపిస్తూ ఓ యువతి ఏకంగా లక్నోలోని ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదుటకు కుటుంబసభ్యులతో చేరుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు అప్రమత్తతో వ్యవహరించిన యువతని కాపాడారు. అమె కేసును విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

అయితే అమె తండ్రిని వున్నావ్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..అతనిపై అధికారికంగా కుట్ర కేసును నమోదు చేసి.. విచారించారు. పోలీసు మార్కు విచారణలో వారి దెబ్బలకు తాళతేక బాధితురాలి తండ్రి పోలీసుల కస్టడీలో మృతి చెందారు. దీంతో వున్నావ్ సహా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితురాలికి ఇదేనా బీజేపి ప్రభుత్వం చేసే న్యాయమని పలు ప్రజాసంఘాలు కూడా నిలదీస్తున్నాయి. అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయమంటే ఏకంగా ఆమె తండ్రి ఉసురుతీస్తారా.? అని ప్రశ్నిస్తున్నాయి.

దీంతో కేసును పక్కదారి పట్టించే పనిలో వున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ నెనగర్ ను కాకుండా అతని సోదరుడు అతుల్ సెనిగర్ తో ఈ కేసులో నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదివారం వరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. బాదితురాలి చనిపోవడంతో హుటాహుటిన ఎలాంటి దర్యాప్తు లేకుండా నిందితులను ఎలా అరెస్టు చేశారన్న ప్రశ్నలకు కూడా ఉదయిస్తున్నాయి.

ప్రభుత్వం కావాలనే ఈ కేసు విషయంలో తాత్సారం చేసిందని.. దీంతోనే బాధితురాలు తన తండ్రిని కొల్పోయిందని గ్రామస్థులు అరోపిస్తున్నారు. ఏడాదిగా తన బాధిత కూతురికి జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు ఎంతో వ్యవప్రయాసలు ఓర్చి అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగినా అతన్ని పోట్టనబెట్టుకున్న తరువాతే కేసు నమోదైందని అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు ఆరుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles