Man loses wife and 2 kids in gambling, gets divorce కలియుగ ధర్మారాజు.. భార్యా పిల్లల్ని జూదమాడిన ఘనుడు..

Man loses wife and 2 kids in gambling gets divorce

bulandshahr, Mohsin, wife, Imran, gambling, Bulandshahr, Betting, village panchayat, divorce, police complaint, Chandorh based youth, CJM court, uttar pradesh

In a shocking incident, a Bulandshahr based man, Mohsin, put his wife and two kids on stake while gambling. He lost all three. Imran, the man who won, then went to Mohsin’s house and forced his wife to come with him.

కలియుగ ధర్మారాజు.. భార్యా పిల్లల్ని జూదమాడిన ఘనుడు..

Posted: 03/28/2018 11:23 AM IST
Man loses wife and 2 kids in gambling gets divorce

మహాభారతం కేవలం కల్పిత గ్రంధం కాదు.. నిజంగా జరిగిన వాస్తవమని అందుకు సంబంధించిన ఆధారాలు వున్నాయని ఇటీవలే వెల్లడైన క్రమంలో.. కురుక్షేత్ర యుద్దానికి దారి తీసిన అసలు ఘటనకు కారణమైన ధర్మారాజు జూదం.. కూడా భారత దేశంలో మూడు పువ్వులు అరు కాయలుగా సాగుతుంది. కలియుగ ధర్మారాజులా మారిన ఓ వ్యక్తి ఏకంగా తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను కూడా జూదంలో పెట్టి ఓటమిపాలై.. పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారించాలని న్యాయస్థానం అదేశాలు జారీ చేయడంతో.. వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులాంద్‌ షహర్‌ కు చెందిన మోహిసీన్ పేకాట వ్యసనానికి బానిసయ్యాడు. అతని మిత్రుడు ఇమ్రాన్ తో జూదమాడి, తన డబ్బును కోల్పోయాడు. ఇక అంతటితో అగక ఎలాగైన గెలవాలని భావించిన మోహసీన్..  తన భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా జూదమాడి ఓడిపోయాడు. దీంతో మరుసటి రోజు జూదంలో గెలిచిన ఇమ్రాన్‌, నేరుగా మోహిసీన్‌ ఇంటికి వెళ్ళి అతని భార్యను, ఇద్దరు పిల్లలను తనతో రమ్మని బలవంతం చేశాడు. దీంతో అమె అరుపులు, కేకలు వేసింది. స్థానికులు గుమ్మిగూడి అతడ్ని అడ్డుకున్నారు. దీంతో విషయం గ్రామ పంచాయితీకి చేరింది.

భార్యను జూదమాడటం తప్పని, అయితే ఇద్దరు పిల్లలో ఒక పిల్లాడిని గెలిచిన ఇమ్రాన్ కు అప్పగించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. దీంతో ఆమె పిల్లల్లో ఒకరిని ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీంతో అరుమాసాలు కనిపెంచిన కొడుకు వేరే వ్యక్తికి అప్పగించడంతో అగ్రహించిన మోహిసీన్ భార్య.. అతనికి విడాకులిచ్చింది. అనంతరం తన భర్త, బలవంతంగా తనను తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇమ్రాన్, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తన బిడ్డను తనకు ఇప్పించాలంటూ అమె అనేక విధాలుగా ప్రయత్నం చేసి విఫలమైంది.

చివరకు పోలీసులు కూడా అమె పిర్యాదును పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు ఎవరో ఇచ్చిన సూచనల మేరకు ఆమె సీజేఎం కోర్టును ఆశ్రయించింది. తన కుమారుడ్ని ఇమ్రాన్ చెర నుంచి విడిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అమె పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, బాధితురాలి తరపున వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులకు అదేశాలిస్తూ, ఒక టీమ్ ను ఏర్పాటు చేసి తప్పించుకుని పరారీలో వున్న నిందితుల కోసం ఏర్పాటు చేయాలని కూడా అదేశాలిచ్చింది. కాగా, ఈ ఘటన 2015లో జరుగగా 2018లో అమెకు పిటీషన్ పై కోర్టు స్పందించింది.

కాగా బాధితురాలి వివరాల ప్రకారం.. తనకు మోహసిన్ తో 2012లో వివాహం జరిగిందని, అతను నిత్యం జూదానికి బానిసయ్యాడని, అయితే వివాహమైన కొన్నాళ్ల వరకు బాగానే వున్నా ఆ తరువాత పేకాటకు బానిసయ్యాడని తెలిపింది. అయితే తనతో పాటు తన ఇద్దరు పిల్లలను 2015లో తన భర్త.. ఇమ్రాన్ అనే తన స్నేహితుడి వద్ద జూదమాడి ఓడిపోయాడని తెలిపింది. అప్పటి నుంచి కనిపించిన వారినల్లా తన బిడ్డను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరానని, అయినా పలితం లేకపోవడంతో.. ఓ పెద్దాయన సూచనతో న్యాయస్థానాన్ని అశ్రయించానని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles