Siberia shopping centre blaze kills 37 సైబిరియా షాపింగ్ మాల్ లో ప్రమాదం.. 37 మంది సజీవదహనం..

37 dead scores missing in siberia shopping mall fire

36 dead in siberia shopping mall, Russia mall fire, siberia, sibera fire, Shopping mall fire, Russia fire, kemerovo shopping mall, russia industrail city, kemerovi shopping mall, Winter Cherry shopping mall, crime

At least 37 people have died in a fire in a shopping mall in the Siberian city of Kemerovo. 69 others were missing, many of them children, and more than 100 people had been evacuated from the complex, which contains cinemas, restaurants and shops.

సైబిరియా షాపింగ్ మాల్ లో ప్రమాదం.. 37 మంది సజీవదహనం..

Posted: 03/26/2018 09:15 AM IST
37 dead scores missing in siberia shopping mall fire

రష్యాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రష్యాలోని పశ్చిమ ప్రాంతంలో గల పారిశ్రమిక ప్రాంత సైబిరియాలోని షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం బారినపడి ఇప్పటి వరకు 37 మంది మాల్ లో సజీవ దహనమయ్యారని సమాచారం. మంటలు వ్యాపించన వార్త తెలిసిన వెంటనే అర్థానాధాలు పెడుతూ అందరూ బయటకు పరుగులు తీయడంతో పలువురు చిన్నారులు తొక్కిసలాటలో కూడా అసువులబాశారు. షాపింగ్ మాల్ లోని సినిమా ధీయేటర్లు, షాపింగ్ సెంటర్లలో దాదాపుగా వెయ్యిమంది వున్నారని సమాచారం. అదివారం కావడంతోనే ఎక్కువ మంది షాపింగ్ కోసం వెళ్లారని తెలుస్తుంది.

సైబీరియా రాష్ట్రంలోని కెమెరోవోలో నగరంలోని వింటర్ చెర్రీ షాపింగ్ మాల్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ మాల్ లో సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వందలాదిమందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చుట్టు ముడుతున్న అగ్ని కీలల నుంచి బయటపడేందుకు చాలామంది షాపింగ్ మాల్  గోడలు, కిటీకీల నుంచి దూకడం కనిపించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు, రెస్కూ టీమ్ లు ప్రమాదస్థలికి చేరకుని ఓ వైపు మంటలను అర్పేందుకు యత్నిస్తూనే, మరోవైపు మాల్ లో వున్న బాధితులను సురక్షితంగా బయలకు తీసుకువచ్చేంుదకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంటుందని అంచాన. ఈ ప్రమాదంలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డగా, మరో 70 మంది గల్లంతయ్యారు. షాపింగ్ మాల్ నిండా దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia mall fire  siberia  sibera fire  Shopping mall fire  Russia fire  kemerovo  russia  

Other Articles