Union Cabinet approves Ayushman Bharat scheme ‘‘ఆయుష్మాన్ భారత్’’కు మోడీ క్యాబినెట్ అమోదం..!

Cabinet clears ayushman bharat national health protection mission

Ayushman Bharat, National Health Protection Mission, AB-NHPM, Modicare, Namocare, pre-existing disease, secc database, poor and vulnerable people, PM Modi, Parliament

The Union Cabinet approved the launch of the Ayushman Bharat — National Health Protection Mission (AB-NHPM), which was announced in the Budget. The scheme will provide a cover of Rs.5 lakh per family per year.

‘‘ఆయుష్మాన్ భారత్’’ తొలి అడుగేసిన మోడీ సర్కార్..!

Posted: 03/22/2018 12:43 PM IST
Cabinet clears ayushman bharat national health protection mission

పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేసింది. పేద ప్రజలకు అందించే ఉచిత అరోగ్య బీమా పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయుష్మాన్ భారత్ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ ఏర్పాటు చేసింది. దీని ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అమోదం కూడా తెలిపింది. దీంతో ఈ పథకాన్ని త్వరలోనే అములును నోచుకోనుంది.

ఆయుష్మాన్ భారత్ మినష్ అధ్వర్యంలో పేదలు, బడుగువర్గాల ఆరోగ్య బీమా వ్యవహరాలను చూస్తుంది. కేంద్రం వద్దనున్న సోషల్ ఎకానమీ డాటా బేస్ లో పొందపర్చిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఏకంగా 10 కోట్ల పేద, బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు ఇక వైద్య చింత వీడినట్టే. అయితే ఈ భీమా ప్రీమియం కోసం ప్రతీ కుటుంబం ఏడాదికి రూ. రెండు వేల రూపాయలను చెల్లించాల్సి వుంటుంది.

అయితే ఆ ప్రీమియం చార్జీలు కూడా వారిపై పడకుండా.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ప్రీమియంలోని మొత్తంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరిస్తాయి. దీంతో ఒక్కో కుటుంబం మొత్తానికి ఒక ఏడాదిలో రూ.5 లక్షల ఆరోగ్యబీమా అందనుంది. అయితే ఈ బీమాలో కుటుంబాలకు సంబంధించిన వక్యుల ఎంతమంది. వారి వయస్సు ఎంత అన్న వివరాలతో సంబంధం లేకుండా కుటుంబంలోని సభ్యులందరీకీ వర్తించనుంది. ఇక దీనితో పాటు ఇప్పటికే బాధపడుతున్న వ్యాధులకు కూడా ఈ భీమా పథకంలో కవరేజి కల్పించనుంది కేంద్రం.

ఈ పథకం నిర్వహణకు ఏటా రూ.10,000 కోట్లు వ్యయం అవుతాయని అంచనా. కాగా, కేంద్రం తీసుకువచ్చిన జన్ దన్ యోజనా పథకం మాదిరిగా ఈ అయుష్మాన్ పథకం మారకుండా చూడాలిన పలువరు కోరుతున్నారు. ఇక మరికోందరు మాత్రం దేశానికి అదాయాన్ని సమకూర్చుతున్నవారితో మధ్యతరగతి వారే అధికమని.. ఈ పథకాలను మధ్యతరగతి వర్గాలకు కూడా విస్తరింపజేయాలని కేంద్రాన్ని విన్నవిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles