Pawan Kalyan meets NRI's jana sena activists పార్టీ నెట్‌వర్కింగ్ కు ఎన్ఆర్ఐ వింగ్ సాయపడాలి: పవన్

Pawan kalyan meets nri s jana sena activists in mangalagiri

Pawan Kalyan nri wing, pawan kalyan nri activists, pawan kalyan nri wing note bank, pawan kalyan nri wing party networking, chandrababu, nara lokesh, TDP. corruption, sand mafia, pawan kalyan jana sena foundation day, jana sena nagarjuna university, jana sena foundation day guntur, jana sena foundation day mangalagiri, jana sena foundation day, Political Yatra, pawan kalyan nri meet, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh, politics

Andhra pradesh actor turned politician Jana Sena chief pawan kalyan meets NRI's activists in mangalagiri at guntur, says he doesnot consider nri activists as note bank, but asks them to help party in network with fans and activists

ITEMVIDEOS: ఎన్ఆర్ఐ వింగ్ అంటే నిధుల బ్యాంకు కాదు: పవన్ కల్యాన్

Posted: 03/15/2018 11:21 AM IST
Pawan kalyan meets nri s jana sena activists in mangalagiri

జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎంట్రీకి సిద్దమవుతున్న క్రమంలో క్రితం రోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జునా యూనివర్శిటీ అవరణలో జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సభలో.. గత ఎన్నికలలో మద్దతు ప్రకటించిన రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీపై అరోపణలు గుప్పించి రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా వేడిపుట్టించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్.. ఇవాళ కూడా మంగళగిరిలోనే బిజీ బిజీగా గడిపారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది వరకు మంగళగిరిలోనే వుంటానని చెప్పిన పవన్.. పార్టీ బలోపేత కార్యక్రమాలను చేపడుతున్నారు.

నిన్నటి సభకు విచ్చేసిన ఎన్ఆర్ఐ వింగ్ పార్టీ శ్రేణులతో పవన్ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ...ఎన్‌ఆర్‌ఐలను పార్టీకి నిధుల బ్యాంకుగా అన్ని పార్టీలు పరిగణిస్తున్నాయని, అయితే తమ పార్టీలో మాత్రం ఎన్ఆర్ఐలను బ్యాంకుగా చూడబోమని స్పష్టం చేశారు. అయితే ఎన్ఆర్ఐ వింగ్ శ్రేణులు పార్టీ నెట్ వర్కింగ్ లో సహాయపడాలని పవన్ కల్యాన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహాయం ఎంతో అవసరమని తెలిపారు. ఎన్నారైల నెట్ వర్కింగ్ ను రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా వుండాలని పవన్ కల్యాణ్ అకాంక్షించారు.

ఎన్నారైల ప్రొత్సాహం, సహకారం జనసేనకు చాలా అవసరమని పవన్ అన్నారు. అయితే తాను కావాలని తప్పులు చేయనని... ఒకవేళ తెలియక తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరతానని అన్నారు. తాను ఏం మాట్లాడినా ఆలోచించే మాట్లాడతానని చెప్పారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విబేధాలు లేవన్నారు. కాగా ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను, పార్టీ నిర్మాణాన్ని ఎన్ఆర్ఐలకు పవన్ కల్యాణ్ వివరించారు.  ఈ సమావేశానికి హాజరైన  ఎన్నారై కార్యకర్తలు పవన్ కల్యాన్ తో కరాచలనం చేయడానికి, ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. ఈ భేటీ అనంతరం వామపక్ష నేతలతో సమావేశం కానున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles