నిజం నిప్పులాంటిది.. అది కాసింత సేపు ఉనికిని చాటుకోలేకపోయినా.. నిలకడ మీద మాత్రం వెలుగులోకి వస్తుందని పెద్దలు పలుమార్లు చెప్పారు. ఇక దేశానికే దిశానిర్దేశం చేసే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోస్తున్న వ్యక్తులు కూడా ఈ విషయంలో తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారని గుట్టును రట్టు చేసింది అడిట్ సంస్థ. దేశయువతకు సన్మార్గంలో నడవాలని చెప్పే స్థాయి వ్యక్తులు.. తప్పుడు మార్గాలను అచరించి.. దేశానికి ఎలాంటి సందేశమిస్తున్నారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో అందులోనూ ట్విట్టర్ లో తన ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునేందుకు అక్రమమార్గాలను అన్వేషించిన వారిలో దేశాలకు చెందిన అగ్రనేతలు కూడా వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ జాబితాలో ఫోప్ ఫ్రాన్సిస్ నుంచి మన ప్రధాని నరేంద్రమోడీ వరకు అనేక మంది వుండటం కలకలం రేపుతుంది. అత్యధిక మంది ఫాలోవర్లు వున్న ప్రధానిగా రికార్డులకెక్కిన ప్రధాని నరేంద్రమోడీ ట్విట్లర్లో వున్న ఫాలోవర్లలో 60శాతం మంది ఫాలోవర్లు నకిలీలేనని తేల్చేశారు. ట్విట్టర్ అకౌంట్ల ఫాలోవర్ల సంఖ్యను అడిట్ చేసే సంస్థ ట్విప్లోమసీ తన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది.
డిజిటల్ వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవడంలో అంతర్జాతీయంగా పలు సంస్థలు, ప్రభుత్వాలకు సహకారం అందించే సంస్థ ‘ట్విప్లోమసీ’ నేతలకు ట్విట్టర్ లో వున్న ఫాలోవర్ల సంఖ్య తప్పుగా పేర్కొంది. నేతలకు వున్న ఫాలోవర్లలో నకిలీలు కూడా ఉనికిని చాటుకుంటున్నారని గుట్టును రట్టు చేసింది. ప్రధాని మోదీకి మొత్తం 40,993,053 మంది ఫాలోవర్లు ఉండగా... అందులో 24,799,527 ఫాలోవర్లు నకిలీలేనని ట్విప్లోమసీ పేర్కొంది. కేవలం 16,191,426 మంది మాత్రమే అధికారిక ఫాలోవర్లు ఉన్నట్టు తేల్చింది.
అయితే ఫేక్ పాలోవర్లు బెడద ప్రధానికే పరిమితం కాలేదు.. ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, రాజు సల్మాన్ ల అకౌంట్లలోనూ నకిలీ ఫాలోవర్లు ఉన్నట్టు గుర్తించిందీ అడిట్ సంస్థ. ఈ నివేదిక ప్రకారం... ట్రంప్‌కి ట్విటర్లో ప్రస్తుతమున్న 48,939,948 మంది ఫాలోవర్లలో 35,980,870 మంది మాత్రమే జెన్యూన్ ఫాలోవర్లు ఉన్నారు. మిగతా 12,445,604 మంది ఊరూపేరు లేని వాళ్లే. కాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కి ట్విటర్లో మొత్తం 3,696,460 ఫేక్ ఫాలోవర్లు ఉండగా... 1,715,634 మంది అధికారిక ఫాలోవర్లు ఉన్నారు. ఇక పోప్ ఫ్రాన్సిస్‌కు కూడా ట్విటర్లో మొత్తం 59 శాతం ఫేక్ ఫాలోవర్లే ఉన్నట్టు నివేదిక వెల్లడించడం విశేషం.
World Leaders and their Fake followers
— Twiplomacy (@Twiplomacy) February 21, 2018
Some of the most followed world leaders and their share of bot followers as determined by https://t.co/TdNIomSdNt. Graphics prepared by @Saosasha @gzeromedia#DigitalDiplomacy pic.twitter.com/viid9ZTReV
Now Congress IT-cell will be on fire.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more