Pawan Kalyan New House Pooja Ceremony at mangalagiri సొంతింటి నిర్మాణం కోసం శాస్త్రోక్తంగా పవన్ భూమిపూజ

Pawan kalyan performs bhomi pooja at mangalagiri for new house

#Pawan Kalyan New House Foundation Stone Laying Cer #live: pawan kalyan new house pooja ceremony @ amar #pawan kalyan new house pooja ceremony #pspk #janasena #pawan kalyan #powerstar pawan kalyan new houser pooja ceremony v #janasena party #tollywood #latest film news #latest updates Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, pawan kalyan, janasena, kondagattu temple, karimnagar, telangana, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan today performed his new house bhomi pooja as per hindu traditions at khaja near mangalgiri of guntur district with his family and friends.

ITEMVIDEOS: సొంతింటి నిర్మాణం కోసం శాస్త్రోక్తంగా పవన్ భూమిపూజ

Posted: 03/12/2018 10:00 AM IST
Pawan kalyan performs bhomi pooja at mangalagiri for new house

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేస్తుందని ఇప్పటికే స్పష్టం చేసిన జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ స్టార్ పవన్ కల్యాన్.. హైదరాబాద్ లో మాత్రమే సొంత నివాసాన్ని ఏర్సాటు చేసుకున్నారు. దీంతో పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చేరువైన ప్రాంతంలో కూడా ఆయన తన సొంత ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోని కాజా గ్రామ సమీపంలో ఆయన రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇవాళ తన కుటుంబసభ్యుల మధ్య ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.

ఇందుకోసం నిన్న సాయంత్రమే కుటుంబసభ్యులతో విజయవాడ చేరకున్న పవన్ కల్యాన్.. ఇవాళ ఉదయమే వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య  శాస్ట్రోక్తంగా, సంప్రదాయబద్దంగా మంగళిగిరి నివాసంలో భూమి ఫూజ నిర్వహించారు. కాగా ఈనెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నాగార్జునా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఇవాళ రేపు కూడా పవన్ కల్యాన్ విజయవాడలోనే వుండే అవకాశాలున్నాయి. అశేషమైన అభిమానుల ఫాలోయింగ్ వున్న పవన్ ఇంటి నిర్మాణ విషయాలు అభిమానులకు తెలిస్తే.. వారు భారీ స్థాయిలో తరలివచ్చే అవకాశం వుందని, దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు వున్నాయని గోప్యంగా వుంచారు.

కాగా భద్రతా కారణాల రిత్యా తన పర్యటన వివరాలను పవన్ కల్యాన్ డీజీపీకి తెలిపారు. దీంతో పవన్ కల్యాన్ సొంతిల్లు నిర్మాణం వద్ద నిన్న ఉదయం నుంచే పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. డీజీపికి సమాచారం అందించడంతో పోలీసుల విభాగంలోని పలువురు నుంచి మీడియాకు సమాచారం అంది.. పవన్ సోంతింటి విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్న పవన్.. ఇవాళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య భూమి పూజ నిర్వహించారు. తన భార్య అన్నా లెజినోవా, ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఆయన, హోమ క్రతువును పూర్తి చేశారు.

తన ఇల్లు, పార్టీ కార్యాలయం చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణగా ఉండే ఈ భవంతిలో 60 శాతం స్థలాన్ని పార్కింగ్, గార్డెనింగ్ కోసం విడిచిపెట్టనున్నారని తెలుస్తోంది. మొత్తం మూడు అంతస్థుల్లో ఉండే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో సమావేశపు మందిరంతో పాటు అతిథులు ఎవరైనా వస్తే బస చేసేందుకు గదులు, శాశ్వత పనివారి నివాసానికి గదులు ఉంటాయని సమాచారం. తరువాతి ఫ్లోర్ లో మరో చిన్న మీటింగ్ హాల్ తో పాటు కిచన్, డైనింగ్ హాల్, బెడ్ రూములు తదితరాలు ఉంటాయని, ఆపై అంతస్థులో రెండు లేదా మూడు గదులను మాత్రమే నిర్మించి, మిగతాదంతా ఖాళీగానే ఉంచాలని పవన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  new house bhomi pooja  mangalagiri  guntur  andhra pradesh  politics  

Other Articles