arun jaitley draws controversy remarks తెలుగువారిని అవమానించేలా కేంద్ర విత్తమంత్రి వ్యాఖ్యలు..?

Union minister arun jaitley draws controversy remarks

Arun Jaitley, KCR, Telangana Rashta samiti, Telugu Desam Party, Chandrababu Naidu, Andhra Pradesh, special status, Telangana, ATMs, No cash, cash shotage, controversial remarks, pushpa leela

Finance Minister Arun Jaitley draws controversy remarks on telugu states people. In a pressmeet yesterday he said that telugu people may hiding their cash bundles in bank lockers and their homes, which is creating the cash shotage in atm centres.

తెలుగువారిని అవమానించేలా కేంద్ర విత్తమంత్రి వ్యాఖ్యలు..?

Posted: 03/08/2018 11:17 AM IST
Union minister arun jaitley draws controversy remarks

ఎన్డీయే పాలకమండలిలోని మంత్రులు నోరుజారగడం పరిపాటిగా మారింది. ఒక్కో మంత్రి ఒక్కో అంశాన్ని టార్గెట్ చేసుకుని అనేక వివాదాస్పద వ్యాక్యలు చేస్తూ.. దేశ ప్రజల అగ్రహానికి కూడా గురయ్యారు. బాధ్యతాయుతమైన పదవులలో కొనసాగుతూ ఇంతటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక తాజాగా సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు అంశంలో దేశ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోకోగా, ఆ తరువాత దేశంలోని వ్యాపారస్థుల నుంచి జీఎస్టీ నేపథ్యంలో కూడా విమర్శల పాలయ్యారు.

ఇక తాజాగా, తెలుగు ప్రజలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు వున్నాయని తెలుగువారు మండిపడుతున్నారు. అసలే అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేసే విషయంలో ఇప్పటికే అంధ్ర రాష్ట్ర ప్రజలు కేంద్రంపై మండిపడుతున్న క్రమంలో.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్గికి అజ్యంపోసేలా వున్నాయి. ఇక అంధ్రులతో పాటు తెలంగాణవాసులను కలసి ఆయన వ్యాఖ్యలు చేశారన్న క్రమంలో.. అటు తెలంగాణ వాసులు కూడా అంధ్రులకు జతకలిసేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నోట్ల కట్టలను దాచుకుంటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే..

కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. క్రితం రోజున అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీ, నిధుల విషయం, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించిన ప్రకటనను పత్రికా ముఖంగా వెల్లడించారు. అయితే అదే సమయంలో అక్కడే వున్న తెలంగాణ బీజేపి నాయకురాలు పుష్పలీలా.. మీడియా ముఖంగా కేంద్రమంత్రి దృష్టికి తెలుగు రాష్ట్రాల్లోని ఏటీయం కేంద్రాలలో నగదు కొరత విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కూడా అన్నారు. పుష్పలీల వ్యాఖ్యలపై  స్పందించిన మంత్రి తాము ఇప్పటికే పంపించాల్సిన డబ్బు కన్నా చాలా అధికంగానే కరెన్సీ నోట్లను అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపించానని చెప్పారు. ప్రజలు నోట్ల కట్టలను బ్యాంకు లాకర్లలో, ఇళ్లల్లో దాచుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  Andhra Pradesh  Telangana  ATMs  No cash  cash shotage  controversial remarks  

Other Articles