17 killed in Florida school shooting, Trump offers condolences నెట్టింట్లో ప్లోరిడా పాఠశాలలో కాల్పుల వీడియోలు..

Florida school shooting 17 killed suspect arrested donald trump offers condolences

Florida High School shooting, Florida shooting latest updates, USA Florida shooting news, Parkland shooting, marjory stoneman douglas high school, Nikolas Cruz, florida, Swat, Fort Lauderdale, Donald Trump, US president, America

Students and passersby alike were in a state of panic when gunfire erupted at a South Florida high school and the internet was able to watch in almost real time.

ITEMVIDEOS: నెట్టింట్లో ప్లోరిడా పాఠశాలలో కాల్పుల వీడియోలు.. బీతావాహం.. భయానకం..

Posted: 02/15/2018 10:14 AM IST
Florida school shooting 17 killed suspect arrested donald trump offers condolences

అమెరికాలో గన్ కల్చర్ పై దుర్ఘటనలు జరిగిన్పుడు మాత్రమే చర్చ జరుగాలన్న డిమాండ్ పెరుగుతున్నా.. ఆ తరువాత కనుమరుగు అవుతుండటంతో.. కాసింత కోపం, పగతో రగిలిపోయే మనుషులు అభంశుభం తెలియని అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు. తాజాగా అమెరికాలో మరోమారు తుపాకి తూటాల కలకలం రేపాయి. తమకే పాపం తెలియని 17 మంది విద్యార్ధుల నూరేళ్ల జీవితాలను అర్థంతరంగా బలితీసుకున్న విషాధ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా పరిధిలో పార్క్ ల్యండ్ లోని మర్జోరీ స్టోన్ మన్ గడ్లస్ పాశళాలలో ఈ ఘటన  రెచ్చిపోయింది.

అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఏకంగా 17 మంది విద్యార్థాలు అసువులు బాయగా, మరో 14 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కాల్పులకు కారణమైన పాఠశాల పూర్వవిద్యార్థి నికోలన్ క్రూజ్ ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని సమాచారం. దీంతో చదువులతో, పాఠాలతో సరస్వతి మందిరంగా వుండే పాఠశాల కాస్తా.. రుధిర ధారలతో బీతావహంగా మారింది.

నికోలన్ క్రూజ్ ప్రవర్తనతో విసిగివేసారిన అక్కడి పాఠశాల ఉపాద్యాయులు అతన్ని కొద్ది రోజుల క్రితం సస్పెండ్ చేశారు. తనను సస్పెండ్ చేశారన్న అగ్రహంతోనే నికోలన్ క్రూజ్ తుపాకీని చేతబట్టి పాఠశాలకు చేరకుని తన తరగతి గతిలోకి వెళ్లి.. అక్కడి విద్యార్థులపై విఛక్షణారహితంగా కాల్పులు జరిపి ఈ ఘాతుకాని ఒడిగట్టాడు. అడ్డ‌కోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ముగ్గురిని  కాల్చేశాడు. అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జ‌రిగింద‌న్న ఆందోళ‌న‌తో అంద‌రూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకుని ఉన్న నికోల‌స్‌.. వారిపై విచ‌క్షణా ర‌హితంగా కాల్చేశాడు.

కాగా ప్లోరిడా పాఠశాలలోని జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇదిలావుండగా, పాఠశాలలో కాల్పుల శబ్దం వినబడగానే విద్యార్థులు నలుదిక్కులా పారిపోగా, కొందరు మాత్రం పాఠశాలలోని కుర్చీల మధ్య దాక్కుని.. పాఠశాలలో జరుగుతున్న ఘాతుకాన్ని తమ సెల్ ఫోన్లలో బందించారు. తాజాగా అ విడియోలు ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఆ వీడియోలను మీరూ చూడండి.
   

My little brother just sent me this video of the swat team evacuating his classroom at stoneman douglas. So scary but glad he's safe. @nbc6 @CBSMiami @NBCNews @wsvn @CBSNews pic.twitter.com/XNTtra221q

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles