Girls drinking beer worry Goa CM నేటి తరం అమ్మాయిలంటే ఆ సీఎంకు భయం

I ve begun to fear as even girls have started drinking beer manohar

manohar parrikar, girls drinking beer, goa cm, state youth parliament, goa secretariat, goa alcohol consumption, girls alcohol consumption, porvorim, goa, drugs, porn, ganja, Goa Chief Minister

Goa Chief Minister Manohar Parrikar said he has now started to fear as “girls have started drinking beer” at the first edition of the State Youth Parliament organised by Legislature Secretariat, Porvorim.

నేటి తరం అమ్మాయిలంటే ఆ సీఎంకు భయం

Posted: 02/10/2018 10:07 AM IST
I ve begun to fear as even girls have started drinking beer manohar

అమ్మాయిల్లో మద్యం సేవించే అలవాటు పెరగడం తనకు భయాంధోళనకు గురిచేస్తుందని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అందోళన వ్యక్తం చేశారు. అయితే అందరూ అని తాను మొత్తాన్నికి దీనిని ఆపాదించడం లేదన్న ఆయన క్రమంగా సంఖ్యమాత్రం పెరుగుతుందని అన్నారు. అయితే తాను ఆల్కహాల్ సేవించే అలవాటు వున్నవారికి ఈ నిజం అర్థమవుతుందన్నారు. అమ్మాయిలలో పెరుగుతున్న ఈ అలబాటు తనకు ఎంతో భయాన్ని కలగజేస్తోందని అన్నారు.

గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్ లో ఆయన ప్రసంగిస్తూ తాను విద్యార్థిగా వున్న కాలంలో తాను చూసిన ఘటనలు ఊటంకించిన ఆయన తాజాగా ఉత్పన్నం అవుతున్న పరిస్థితులను కూడా బేరిజు వేసుకుని యువతను తన ప్రసంగంచ అకర్షించి, అలోచింపజేసేలా అకట్టుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో కాలేజీలో ఓ చిన్న గ్రూపు గంజాయిని సేవించేదని.. కానీ ఇప్పడు విద్యార్థులను మాదకద్రవ్యాల వ్యాపారులు టార్గెట్ చేసిన వారిని బానిసలుగా మారుస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు.

మాదకద్రవ్యాల బారిన తమ పిల్లలు పడకుండా తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూనే వుండాలని అన్నారు. తమ ఇళ్లలోంచి విలువన వస్తువులు క్రమంగా మాయమవుతున్నాయంటే అదే తొలి సంకేతమని అప్రమత్తంగా వుండాలని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. డ్రగ్ నెట్ వర్క్ ను అంతమొందించే ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి డ్రగ్స్ ను తరిమికొడతామనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. కాలేజీలో డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందని భావించడం లేదని చెప్పారు. ఇప్పటి వరకు 170 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు.

మన చట్టం ప్రకారం కొంత మొత్తం డ్రగ్స్ తో పట్టుబడిన వ్యక్తులు ఎనిమిది నుంచి 15 రోజుల్లో బెయిల్ పై బయటకు వస్తున్నారని... వీరిని కోర్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నాయని... ఏదేమైనా డ్రగ్స్ వాడుతున్నవారు పట్టుబడుతుండటం జరుగుతోందని అన్నారు. గోవా యువత కష్టపడి పని చేయడానికి ఇష్టపడటం లేదని... సింపుల్ వర్క్ వైపే మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గవర్నమెంట్ క్లర్క్ ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారని... గవర్నమెంట్ జాబ్ అంటే పని ఉండదనే భావంతో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles