IAF Captain held of leaking information ఇండియన్ నేవీలో నయవంచకుడు.. వాట్సాప్ లో పాక్ కు కీలక సమాచారం

Indian air force captain held of leaking classified information

Espionage charges, IAF's Central Security and Investigation Team, Indian Air Force Group Captain, IndianAirForce, Indian Air Force, Pakistan, Spy, electronic gadget, social media, facebook, whatsapp

Army, air force and navy personnel are required to follow strict guidelines on social media. The armed forces impose severe restrictions on the cyber activity of their officers.

ఇండియన్ నేవీలో నయవంచకుడు..

Posted: 02/09/2018 12:34 PM IST
Indian air force captain held of leaking classified information

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఓ అధికారి భారత అర్మీలో ఉన్నతస్థానంలో కొనసాగుతున్న విషయం ఇప్పడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతమాత బిడ్డగా వుంటూ దాయాధి పాకిస్థాన్ కు మన రక్షణ శాఖకు చెందిన సమాచారం మొత్తాన్ని చేరవేస్తున్నడన్న విషయం అర్మీలో పెను దుమారాన్ని సృష్టిస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు  ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సదరు ఉన్నతాధికారి భారత వాయుసేనలో ఉన్నత పదవిలో ఉన్న కెప్టెన్‌ అరుణ్‌ మార్‌ వా, ఇక్కడ గూఢచారిగా పనిచేస్తూ, ఎంతో సమాచారాన్ని పాక్ కు చేరవేశాడని తెలుస్తోంది. అతను హనీ ట్రాప్ కు గురయ్యాడ అన్న విషయంలో కూడా అధికారులు విచారిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగంపై అటు భారత దేశ రక్షణా విభాలన్నింటిపై అంక్షలు వున్నా.. అతను ఏదో ఎలక్ట్రానిక్ డివైజ్ ను తన చేతిలో పట్టుకెళ్లడాన్ని గమనించిన అధికారులు అయనను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు.

ఐఎస్ఐ తదితర సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ అరుణ్ మార్ వా ను అరెస్ట్ చేసింది. గత కొన్ని నెలలుగా ఆయన తన ఫోన్ నుంచి వాట్స్ యాప్ మాధ్యమంగా ఎన్నో ఫోటోలు, కీలక పత్రాలను ఐఎస్ఐకి చేరవేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Air Force  Pakistan  Spy  electronic gadget  social media  facebook  whatsapp  

Other Articles