No Change in Petrol and Diesel Prices Today పన్నుల భారంతో కొండెక్కుతున్న ఇంధనం..

No scope for further excise duty cuts on petrol diesel prices

petrol, diesel, prices, oil ministry, PM Modi, excise duty, vat, business, India, news, companies, corporate, management, marketing, markets, advertising, finance, industry, retail price, diesel costs, Mumbai, Narendra Modi, government, sales tax, VAT rates

Petrol and diesel prices on February 7 were kept unchanged following a three-day fall in Brent crude oil price on Tuesday. The Brent crude oil price, however on Wednesday, up 43 cents after falling for three continuous days to $67.29 per barrel.

పన్నుల భారంతో కొండెక్కుతున్న ఇంధనం.. వాహనదారులకు కనరాని ఊరట

Posted: 02/07/2018 12:53 PM IST
No scope for further excise duty cuts on petrol diesel prices

పెట్రోలు, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇటీవలి బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున దిగుమతి  సుంకాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించేలా లేకపోవడంతో ఈ విషయాన్ని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. అంచనా వేస్తున్న దానికంటే ద్రవ్యలోటు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండడంతో ఇప్పుడు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.

అందుకనే ఈ ఆలోచన నుంచి ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇక, దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే పెట్రో ధరలు భారత్‌లోనే అధికం. పెట్రోలు రిటైల్ ధరల్లో 50 శాతం పన్నులే ఉండడంతో ఇరుగు పొరుగు దేశాల కంటే కూడా భారత్‌లో పెట్రో ధరలు అధికంగా ఉంటున్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి శరాఘాతంలో పరిణమించిన పరిస్థితులే ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి పునరావృతం అవుతున్నాయి.

ఇంధన ధరలు ఏకంగా నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రధాని మోడీ హయాంలో ఈ స్థాయికి ఇంధన ధరలు చేరుకోవడం తొలిసారి. అయితే మోడీ హయాంలో పదకొండు పర్యాయాలు పెంచిన ఎక్సైజ్ సుంఖాన్ని మాత్రం ఇప్పటికి రెండు పర్యాయాలే తగ్గించగా, దానిని పూర్తిగా ఎత్తివేస్తే తప్ప.. ఇంధన ధరలు దిగివచ్చేట్లు లేవు. ఇదే పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగితే ఇది బీజేపి ప్రభుత్వానికి తిరిగి అధికారం చేపట్టేందుకు అవరోధంలా కూడా మారే అవకాశాలున్నాయి.

కాగా లీటరు పెట్రోలు ధర ఇప్పుడు రూ. 78 నుంచి రూ. 81కి పైగా ఉంది. మంగళవారం నాడు అంతర్జాతీయంగా క్రూడ్ అయిత్ ధరలు తగ్గుముఖం పట్టినా.. మన ఇంధన సంస్థలు మాత్రం పెట్రోల్ ధరలను తగ్గించలేదు. నెల కనిష్టస్థాయికి క్రూడ్ అయిల్ ధరలు చేరినా.. అ మేరకు ఇంధన సంస్థలు ధరలను తగ్గించలేదు. దీంతో సొమవారం నాటి ధరలనే ఇంధన సంస్థలు కొనసాగిస్తున్నాయి. ఇటు ధరల తగ్గించక అటు ఎక్సైజ్ సుంకాన్ని తొలగించక వాహనదారుల జేబులకు కేంద్రం కత్తెర పెడుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారల్ కు 132 డాలర్ల వద్ద ఉన్న సమయంలోనూ, పెట్రోలు ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యే ఉండగా, ఆ స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం క్రూడాయిల్ ధర 60 డాలర్లకన్నా దిగువనే ఉన్నప్పటికీ, పెట్రో ఉత్పత్తుల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న వేళ, పన్నులను పెంచుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానాను నింపుకునేందుకే చూశాయని, ఇప్పుడు ధరలు పెరుగుతుంటే మాత్రం పన్నులను సవరించడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  diesel  prices  oil ministry  PM Modi  excise duty  vat  business  

Other Articles