Girl And Her Friends Beaten In Greater Noida మోరల్ పోలీసింగ్ పేరుతో పోకీరీల విపరీతాలు

Girl and her friends beaten in greater noida video goes viral

Girl And Her Friends Beaten In Greater Noida, Video Goes Viral, moral policing, Greater Noida, Greater Noida girl beaten, Video of boy brutally beating a girl, Bisrakh, goes viral, Boy brutally beats girl in Greater Noida's Bisrakh, viral videos, videos viral, Bisrakh, greater nodia, uttar pradesh, crime

This incident came into light after a month as the police identified the two miscrents and arrested them for beating a girl and her friends on January 1st in greater nodia outskirts.

ITEMVIDEOS: అమ్మాయన్న కనికరం కూడా లేకుండా.. మరీ ఇలానా..?

Posted: 01/31/2018 01:12 PM IST
Girl and her friends beaten in greater noida video goes viral

ఉత్తర్ ప్రదేశ్ లో మోరల్ పోలీసింగ్ పేరుతో పనిపాట లేని పోకిరీ యువకులు సాగిస్తున్న విపరీతాలు అన్ని ఇన్నీ కావు. ఎక్కడ ఏ ఇద్దరు కనబడినా వారి చెంతకేగి ఏ మాత్రం మాటముచ్చట లేకుండా కర్రలతో దాడి చేస్తూ అకృత్యాలకు తెగబడుతున్నారు. కేవలం మగవారినేగా అనుకుంటే.. అంతటితో అగకుండా అక్కడున్న అడవారిపై కూడా దాడులకు తెగబడుతూ.. తమలోని మరో సాడిజాన్ని మేలుకొలుపుతున్నారు.

భారత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలపై అసలు మగవారు చేయికూడా వేయరాదు. అలాంటి ఎవరో తెలియని పరపురుషలు ఏకంగా కర్రలతో దాడులకు తెగబడటం మన సంస్కృతి ఎలా అనిపించుకుంటుందన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి అలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమపై స్థానిక యువకులిద్దరు దాడి చేశారని బాధితులు పిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ తరలించడంతో వారి సెల్ ఫోన్లలో నిక్షిప్తమైవున్న వీడియో బహ్యప్రపంచంలోకి వచ్చి వైరల్ గా మారింది.

జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరపు వేడుకలు జరుపుకునేందుకు మొత్తంగా ముగ్గురు స్నేహితులు గ్రేటర్‌ నోయిడా శివార్లలోని బిస్రాక్ ప్రాంతంలో గల తమ ఫామ్ హౌజ్ కు వెళ్తున్నారు. వారిలో ఇద్దరు అబ్బాయిలతో పాటు ఓ అమ్మాయి కూడా వుంది. దీనిని గమనించిన ఇద్దరు స్థానిక యువకులు వారిని అడ్డుకుని వారిని నిలువరించారు. అంతటితో అగని పోకిరీ యువకులు వారిపై దాడికి తెగబడ్డారు. యువకులతో పాటు వారితో వున్న యువతిపై కూడా దారుణంగా దాడి చేశారు. విచక్షణా రహితంగా వారిని బెదిరిస్తూ చావు దెబ్బలు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో వివాదాస్పద వైరల్‌ వీడియోగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : moral policing  girl and her friends  Bisrakh  greater nodia  uttar pradesh  crime  

Other Articles