Young actor Praful Bhalerao killed in train accident రైలు ప్రమాదంలో విషాదం.. నటుడి దుర్మరణం

Actor praful bhalerao falls to death from train in mumbai

child artist, Tu Majha Sangati, Praful Bhanerao, Marathi televison, Kunku, Barayan

Marathi actor Praful Bhalerao was killed in a train accident, when he was on his way to Goregaon from Malad in the western suburbs, a police official said.

రైలు ప్రమాదంలో విషాదం.. నటుడి దుర్మరణం

Posted: 01/23/2018 03:45 PM IST
Actor praful bhalerao falls to death from train in mumbai

చిత్రపరిశ్రమలో బాలనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. అటు సినీ, ఇటు బుల్లితెర మరాఠీ ప్రేక్షకులను అలరించిన నటుడు ప్రఫుల్ భలేరావు రైలు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే కదిలిన రైలును ఎలాగైనా ఎక్కాలన్న తొందరలో ఇరవై రెండేళ్ల నటుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన ముంబైలోని మలాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. తన స్వగ్రామమైన గోరేగావ్ కు వెళ్లాలన్న ప్రయత్నంలో మలాద్ స్టేషన్ కు వచ్చిన ప్రపుల్లా, నడుస్తున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన అతనిని దగ్గరలోనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. ఆపై వచ్చిన పోలీసులు, అతని సెల్ ఫోన్ ను పరిశీలించి, మృతుడు సినీ, టీవీ నటుడని గుర్తించారు. కాగా, ప్రఫుల్లా భలేరావు బాల నటుడిగా పరిచయమై గుర్తింపు పొందాడు. మరాఠీ టీవీల్లో ప్రసారమైన ‘కుంకు’, 'తు మాజా సంగతి', 'నకౌషి', 'జ్యోతిబా పూలే' తదితర సీరియల్స్ లలో నటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : child artist  Tu Majha Sangati  Praful Bhanerao  Marathi televison  Kunku  Barayan  

Other Articles