Janasena Veera Mahila social media wing launched by pawan జనసేన వీర మహిళ సోషల్ మీడియా విభాగం లాంచ్..

Janasena veera mahila an exclusice social media wing for women

jana sena veera mahila, veera mahila janasena, veera mahila social media, Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, pawan kalyan, janasena, social media, veera mahila, telangana, andhra pradesh, politics

Janasean president Pawan Kalyan today launched a new social media handle JSP Veera Mahila, which is aimed at women empowerment and addressing of women related issues.

ITEMVIDEOS: జనసేన వీర మహిళ సోషల్ మీడియా విభాగం లాంచ్..

Posted: 01/22/2018 03:20 PM IST
Janasena veera mahila an exclusice social media wing for women

జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజనేయస్వామి అలయం నుంచి తన అప్రహిత రాజకీయ యాత్రను ఫ్రారంభించనున్నారు. కాగా అంతకుముందే ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మరో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జనసేన పార్టీ తరపున తన పార్టీకి సంబంధించిన విషయాలను ముందుగా తన జనసేన సోషల్ మీడియాలో వెల్లడించడం మనం గత కొన్నాళ్లుగా చూస్తున్నాం. ఇదే తరుణంలో ఏ రాజకీయ పార్టీ అచరించని విధానాన్ని అమలుపర్చారు పవన్.

అదే జనసేన పార్టీ వీర మహిళా విభాగం. ఇదేంటి అన్ని పార్టీలకు మహిళా విభాగాలు వున్నాయిగా.. అంటారా.. ఏ రాజకీయ పార్టీకైనా మహిళా కార్యకర్తలు వుంటారు కాబట్టి విభాగాలు వుంటాయి. అయితే ఈ విషయంలో మరో అడుగుముందుకేసిన జనసేన.. మహిళా విభాగానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. దానిని కొండగట్టుకు బయలేదేరి వెళ్లబోయే ముందు పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలతో లాంఛనంగా ప్రారంభించారు. జనసేన వివిధ విభాగాలకు ఆసక్తికర పేర్లు పెట్టే పవన్.. మహిళా విభాగానికి కూడా అలాంటి పేరునే పెట్టారు.

'వీరమహిళ' పేరుతో సోషల్ మీడియా బృందాన్ని ఏర్పాటు చేశారు. క్రియాశీలక సభ్యులుగా పనిచేయడానికి ముందుకు వచ్చిన మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసువచ్చే విధంగా కృషి చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలపై మహిళాలోకానికి అవగాహన కలిగించేలా వీరు పూనుకుంటారని పనవ్ చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేద్దామని, దేశాభివృద్ధిలో మనవంతు పాత్ర పోషిద్దామని పవన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  social media  veera mahila  telangana  andhra pradesh  politics  

Other Articles