TTDP Ready to Take Action against Motkupalli | విలీన కామెంట్లు.. మోత్కుపల్లి పై వేటు?

Telangana tdp serious on motkupalli comments

Motkupalli Narasimhulu, Telangana TDP, TRS, Merge Comments, Motkupalli Narasimhulu Ramana

Telangana TDP Serious on Motkupalli Narasimhulu Comments. Ready to take action against him. Few Days back Motkupalli asks Chandrababu to merge party in TRS.

విలీన కామెంట్లు.. మోత్కుపల్లి పై వేటు?

Posted: 01/21/2018 03:21 PM IST
Telangana tdp serious on motkupalli comments

టీఆర్ఎస్ లో టీటీడీపీని విలీనం చేయాలంటూ మోత్కుపల్లి నరసింహులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ, మోత్కుపల్లిపై చర్యలు తీసుకునే యోచనలో పార్టీ అధిష్టానం ఉందని అన్నారు.

వికారాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోత్కుపల్లి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలను కార్యకర్తలెవ్వరూ ఒప్పుకోరని అన్నారు. ప్రగతి భవన్ పైరవీ భవన్ గా మారిందని, ప్రగతి భవన్ ను ప్రజా ఆసుపత్రిగా మార్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

ప్రజాధనాన్ని దోచుకోవడంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండేదని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోటీపడుతోందని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles