Court Orders Seize Collector Amrapalli Car | కలెక్టర్ అమ్రపాలికి షాక్.. కారు సీజ్ చెయ్యమన్న కోర్టు

Court gives shock to collector amrapali

Warangal, Collector Amrapali, Warangal Court, ICDS Office, Collector Amrapali Car, Amrapali Car Seize, Amrapali Court, ICDS Payments, Amrapali Fortuner Car

Warangal Court Gives Shock To Collector Amrapali. Warangal collector Amrapali's vehicle confiscated. For not paying the pending bills of the private building being used as the ICDS office, the district court on Saturday ordered the collector's vehicle to be confiscated.

కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు సీరియస్

Posted: 01/20/2018 04:32 PM IST
Court gives shock to collector amrapali

వరంగల్ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలిపై జిల్లా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీడీఎస్‌ కార్యాలయం బకాయిల చెల్లింపు విషయంపై ఆమె వైఖరిని నిలదీసింది. ఐసీడీఎస్ భవనాన్ని అద్దెకు తీసుకుని.. బకాయిలు 3 లక్షల రూపాయలకు చేరినా చెల్లించడం లేదు.

దీనిపై ఐసీడీఎస్ భవన యజమాని కృష్ణారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కలెక్టర్‌ అమ్రపాలి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణం కిరాయి బకాయిలు చెల్లించాలని.. అంతవరకు ఆమ్రపాలి వినియోగిస్తున్న ఫార్చునర్ కారును జప్తు చేయాలని వరంగల్ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆదేశించారు.

ప్రస్తుతం ఆమె వరంగల్ అర్బన్‌తో పాటు రూరల్ జిల్లా కలెక్టర్ గానూ వ్యవహరిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

స్పందించిన అమ్రపాలి.. 

కాగా,  కోర్టు ఆదేశాలపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్పందించారు. వారంలోగా అద్దె చెల్లించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని కిషన్‌పురలో ఉంటున్న కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన  భవనాన్ని ఐసీడీఎస్‌ కార్యాలయం కోసం ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. అయితే 2014 నాటికి 3,30,958 అద్దె చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించలేదు.  దీంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles