obscene video in tdp whatsapp group టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో..

Obscene video in tdp kakinada whatsapp group

kakinada, TDP Party, whatsapp group, vice chairman, korivuri raju, high command, serious, twitter, social media, lady councillors

outrage in kakinada tdp party as vice chairman of the muncipality posts obscene video in an official whatsapp gorup.

టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియో దుమారం..

Posted: 01/09/2018 10:04 AM IST
Obscene video in tdp kakinada whatsapp group

సామాజిక మాద్యమాల అందుబాటులోకి రాగానే వాటిని సద్వినియోగం చేసుకుంటున్న వారి కంటే వాటిని దుర్వినియోగం చేసుకుంటున్న వారే అధికంగా వున్నారు. ఏదో ఒక సందర్భంగా ఇలా సోషల్ మీడియాకు వక్రంగా వినియోగించుకుని రాజకీయ నేతలు వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలో మంత్రుల ఇలా అనేక మంది నేతలే చెడుదారిలో పయనిస్తున్నారు.

సరిగ్గా అలాగే టీడీపీ వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో ఒకటి కలకలం రేపింది. కాకినాడ మునిసిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు ఈ వీడియోను పోస్టు చేయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అశ్లీల వీడియో వ్యవహారం ప్రకంపనలు సృష్టించడంతో రాజు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు పొరపాటున ఆ వీడియోను పోస్టు చేశారంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోను పోస్టు చేసిన రాజుపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దాపురం టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. పలువురు పెద్దలు, ముఖ్యనాయకులు ఉండే ఈ గ్రూపులో అభ్యంతరకర వీడియోను ఎలా పోస్టు చేస్తారని రాజును నిలదీశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చారని మండిపడుతున్నారు. రాజు వ్యవహారంపై అధిష్ఠానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేపో, మాపో ఆయనపై చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles