Fatima college students thank Pawan Kalyan for his efforts న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తా: పవన్ కల్యాన్

Pawan kalyan assures his support to fatima college students

actor, chandrababu naidu, fatima medical college, jana sena party, pawan kalyan, politician, andhra pradesh

Students of Fatima Medical College, along with their parents met Jana Sena party chief Pawan Kalyan in Hyderabad at the party headquarters, to thank for his efforts

న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తా: పవన్ కల్యాన్

Posted: 12/30/2017 07:17 PM IST
Pawan kalyan assures his support to fatima college students

ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తానని సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కల్యాన్ అన్నారు.  హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు తన పార్టీ వారికి మద్దుతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

మన దేశంలో న్యాయానికి, ధర్మానికి, సత్యానికి ఎప్పటికీ విజయం సాధిస్తుందని ఇతిహాసాల దగ్గర్నురచి.. తాజాగా అనేక ఘటనల వరకూ నిరూపించాయని అన్నారు. అదే క్రమంలో ఫాతిమా వైద్య కాలేజీ విద్యార్థులకు కూడా న్యాయం తప్పక దక్కుతుందని అన్నారు. విద్యార్థులు కూడా విజయం సాధిస్తుందన్న పవన్‌ కల్యాన్‌.. ఆర్డినెన్స్‌ అమలయ్యే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు.

విద్యార్థులకు బాసటగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు పవన్‌ కల్యాన్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. 2015 సంవత్సరానికి ఫాతిమా కళాశాలకు ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. న్యాయం చేయాలని మూడేళ్లుగా విద్యార్థులు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles