Psycho lover Stabs Girl to Death A Girl ప్రేమోన్మాది ఘాతుకం: కలకలం రేపిన యువతి హత్య..

Psycho lover stabs girl to death in nemalipeta of bhadradri kothagudem district

jilted lover, srinivas rao, pravallika, jilted lover murder, jilted lover sucide, jilted lover in badradri, jilted lover in dummapeta, badradri kothagudem district, dummapeta, nemalipeta, lover murder, khammam suicide, Telangana, crime

Jilted lover srinivasa rao murdered a vidya volenteer pravallika in nemalipeta of dummapeta mandal in badradri kothagudem district.

ప్రేమోన్మాది ఘాతుకం: కలకలం రేపిన యువతి హత్య..

Posted: 12/30/2017 06:39 PM IST
Psycho lover stabs girl to death in nemalipeta of bhadradri kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమోన్మాదికి ఘాతుకానికి పాల్పడ్డాడు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని నెమలిపేటలో యువకుడి ప్రేమను తిరస్కరించిన యువతని ప్రమోన్మాది కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలులుగా వెంటపడిన యువకుడు అమె విద్యావాలెంటీరుగా విధులు నిర్వహిస్తున్న పాఠశాల అవరణలోనే పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుకు చెందిన వూటుకూరు ప్రవళిక (24) తన కుటుంబంతో కలిసి అశ్వారావుపేటలో గత కొంతకాలంగా నివాసం ఉంటోంది. నెమలిపేట ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది. ఆమె తండ్రి వేంసూరు ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఇదిలావుండగా, కుకునూరుకు చెందిన వనమా శ్రీనివాసరావు (26) తనను పెళ్లి చేసుకోవాలంటూ కొంతకాలంగా ప్రవళికను వేధిస్తూ వెంటపడుతున్నాడు.

దీంతో కుటుంబ సభ్యులతో పాటు ప్రవళిక అంగీకరించకపోవడంతో ఇవాళ సాయంత్రం పాఠశాల వద్దే తన వద్ద ఉన్న కత్తితో దాడిచేసి ఆమెను హత్యచేశాడు. అనంతరం తానూ అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల పల్లవికి వివాహం నిశ్చయం కావడం వల్లే కక్ష పెంచుకొని శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles