Thieves drill hole in bank wall, steal Rs 1cr కన్నం వేసి రూ.కోటి కొల్లగొట్టిన కేటుగాళ్లు..

Gang drills hole in bank wall flees with rs 1 crore

mundka metro, Mundka, Delhi's Mundka, CCTV cameras, CCTV, Bank Heist, Mundka area, Delhi, bank robbery, cash and valuables, CCTV cameras, gas cutters, mundka bank, delhi, crime

In a plot that could best fit a film's script, a group of men drilled a hole through the wall of a bank in Mundka area of Delhi and stole cash and valuables worth Rs one crore.

కన్నం వేసి రూ.కోటి కొల్లగొట్టిన కేటుగాళ్లు..

Posted: 12/20/2017 11:37 AM IST
Gang drills hole in bank wall flees with rs 1 crore

దేశరాజధాని ఢిల్లీలో భారీ బ్యాంకు దోఫిడి పోలీసులకు పనితీరుకు, స్థానికులు అప్రమత్తతను ప్రశ్నిస్తోంది. ఢిల్లీలోని శివారు ప్రాంతంలో గల ఓ బ్యాంకుకు కన్నం వేసిన దోంగలు ఏకంగా పది గంటల పాటు బ్యాంకులో తమ కార్యకలాపాలన్నీంటినీ ముగించుకుని కేటుగాళ్లు పారిపోయారు. ఈ ఘటన పోలీసులకు సవాలు విసురుతోంది. ఇప్పటికే ఓ వైపు దేశరాజధాని నేరాలకు రాజధానిగా మారిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న క్రమంలో ఈ దోపిడీలు వారికి నిద్రకు దూరం చస్తున్నాయి.  

బ్యాంకు లాకర్లను గ్యాస్ కట్టర్లతో కోసి మరీ దోపిడి చేశారు. లాకర్లలోని రూ. కోటికిపైగా విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఔటర్ ఢిల్లీలోని ముంద్కాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో దొంగలు మొత్తం 15 లాకర్లు బద్దలుగొట్టడంతో పాటు సీసీ కెమెరాలను కూడా దగ్ధం చేశారు. బ్యాంకు దోపిడికి వారు ఏకంగా ఎనమిది గ్యాస్ సిలిండర్లను వాడినినట్టు పోలీసులు తెలిపారు. బ్యాంకు పక్కనే ఉన్న ప్లాటు లోనికి కన్నం వేసిన దోంగలు గ్యాస్ కట్టర్లు, 8 గ్యాస్ సిలిండర్లు ఉపయోగించి బ్యాంకు లాకర్లను తెరిచారు.

శనివారం, లేదంటే ఆదివారం రాత్రి బ్యాంకు సెలవు దినాలను పరిగణలోకి తీసుకున్న దొంగలు ఈ తరహా చోరికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సొత్తుతో ఉడాయించిన దొంగలు గ్యాస్ సిలిండర్లు, రంధ్రం చేసేందుకు ఉపయోగించిన వస్తువులను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి కొత్తగా ఉన్నాయని, దోపిడీ కోసమే వాటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. వాటిని కూడా పరిశీలించిన పొలీసులు వాటిపై వేలిముద్రలను కూడా సేకరిస్తున్నారు.

బ్యాంకుకు రంధ్రం చేయడానికి రెండు మూడు గంటలు పట్టి ఉంటుందని, అయితే బ్యాంకు రద్దీ రోడ్డు పక్కగా ఉండడంతో రంధ్రం చేస్తున్న చప్పుడు వాహనాల శబ్దాల్లో కలిసిపోయి వినిపించి ఉండకపోవచ్చని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యంత పకడ్భంధీగా జరిగిన ఈ దోపిడిలో బ్యాంకు సిబ్బంది హస్తం ఉండొచ్చన్న అనుమానంతో వారిని కూడా విచారిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mundka area  Delhi  bank robbery  cash and valuables  CCTV cameras  gas cutters  mundka bank  delhi  crime  

Other Articles