every single thing is part and sketch of swathi says rajesh స్వాతి ప్లాన్.. స్కెచ్ ప్రకారమే.. నాది సహకారమే: ప్రియుడు

Every single thing is part and sketch of swathi says rajesh

Sudhakar Reddy, Rajesh, Mahbubnagar, Lakshmi Narayana, Apollo Hospitals, murder, arrest, nagar kurnool, telangana, crime

After arrest of rajesh in sudhakar reddy murder case, police takes his statement in which he states he had no rivalry with sudhakar reddy, but its the swathi who planed, and murdered him. He had only supported her.

ప్లాన్.. స్కెచ్ అంతా స్వాతిదే.. నాది సహకారమే: ప్రియుడు

Posted: 12/14/2017 02:57 PM IST
Every single thing is part and sketch of swathi says rajesh

స్వాతి భర్త సుధాకర్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలూ లేవని, కేవలం స్వాతి కోరిక మీదటే అతని హత్యకు సహకరించానని రాజేష్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించాడు. అయితే స్వాతి అంటే తనకెంతో ఇష్టమని అందుచేతే తాను సుధాకర్ హత్యకు సహకరించానని చెప్పాడు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న రాజేష్, స్వాతి కోరిక మేరకే తానీ ఘాతుకానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. స్వాతితో తనకు పరిచయం, అనుబంధం ఉన్నమాట వాస్తవమేనని కూడా రాజేష్ అంగీకరించాడని సమాచారం.

స్వాతికి తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. తాను పరిచయం అయిన తరువాత మాత్రం భర్తంటే తనకు ఇష్టం లేదని చెప్పేదని, తన భర్త తన గురించి అసలు పట్టించుకోవడం లేదని, అందుకే తనకు కూడా భర్త వద్దని అనుకుంటున్నానని స్వాతి తనతో చెప్పేదని రాజేష్ తన వివరణలో పేర్కోన్నాడు. అయితే స్వాతి తనతో మనం ఎలాగైనా కలిసుందామని పదే పదే కోరేదని చెప్పాడు. అమె చెప్పిన మాటలు నమ్మి ఈ పనికి పాల్పడ్డానని రాజేష్ వెల్లడించినట్టు పోలీసు వర్గాల సమాచారం

నాగర్ కర్నూలు పోలీసులు రాజేష్ ను ఇంటరాగేట్ చేస్తూ అతని నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. స్వాతి ఎలా పరిచయమైందన్న విషయం నుంచి, వారిద్దరి మధ్యా బంధం చిగురించడానికి కారణాలను కూడా అడుగుతున్నారు. ఇక సుధాకర్ రెడ్డిని హత్య చేసిన తీరు గురించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సుధాకర్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చిన నేపథ్యంలో అది ఎక్కడిదని, ఎవరు తీసుకువచ్చారన్న వివరాలూ సేకరించారు. అయితే సుధాకర్ తో తనకు సరిగ్గా పరిచయం కూడా లేదని రాజేష్ చెప్పకోచ్చాడు.

కాగా స్వాతిపై ప్రేమతోనే అమె ప్లాన్, ప్రకారం వేసిన స్కెచ్ ప్రకారం అంతా చేసేందుకు సహకరించానని చెప్పిన రాజేష్.. అమెపై ఎంత ఇష్టం లేకపోతే.. భరించలేని నొప్పిని సైతం భరించాలని నిర్ణయించుకున్నానని, అందుకే ముఖాన్ని కాల్చుకున్నానని చెప్పాడు. స్వతహాగా బ్రహ్మాణ కుటుంబానికి చెందిన తనకు మాంసాహారం తినడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదని చెప్పాడు. స్వాతిపై వ్యామోహంతో అమె వేసిన ప్లాన్ ను అమలు చేయడంలో సహకరించానని చెప్పాడు. సుధాకర్ ను హత్య చేయాలన్న ప్లాన్ స్వాతిదేనని వెల్లడించాడు. సుధాకర్ కు తమ విషయం గురించి తెలిసిందని, అతని తలకు దెబ్బతగిలిందని కూడా స్వాతి చెబితేనే తనకు తెలిసి వారింటికి వెళ్లానని రాజేష్ పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudhakar Reddy  Rajesh  Mahbubnagar  Lakshmi Narayana  Apollo Hospitals  murder  arrest  nagar kurnool  telangana  crime  

Other Articles