six maoists dead in police encounter at badradri తెలంగాణ టేకులపల్లిలో భారీ ఎన్ కౌంటర్..

Encounter in tekulapally of badradri kothagudem district

encounter in tekulapally forest, encounter in badradri, encounter in melapally forest, encounter in kothagudem, police-maoists encounter, encounter in telangana, police, maoists, badradri kothagudem, tekulapally forest area, six maoists, exchange of fire, telangana, crime

On the tip of information that maoists in badradri kothagudem district are conducting a meeting at tekulapally, police forces ask them to surrender,but instead they opened fire on police forces to retiliate task force opened in encounter six maoists dead.

తెలంగాణ టేకులపల్లిలో భారీ ఎన్ కౌంటర్..

Posted: 12/14/2017 10:58 AM IST
Encounter in tekulapally of badradri kothagudem district

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ఉలక్కిపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి మావోయిస్టుల ఉనికి లేదని చెప్పాలి. అయితే అడపాదడపా మావోలు తమ ఉనికిని చాటుకుంటూనే వున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇంతటి స్థాయిలో మావోలు.. పోలీసులు ఎన్ కౌంటర్ లో మరణించడంతో జిల్లా ప్రజలు అందోళనకు గురయ్యారు.

టేకులపల్లి మండలం మేలపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందిన మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. టేకులపల్లి మండలంలోని మేలపల్లి అటవీ ప్రాంతంలో కొంత మంది మావోయిస్లులు సమవేశం అవుతున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.

దీంతో వారిని లొంగపోవాల్సిందిగా అడిగినా వారు అందుకు అంగీకరించకుండా కాల్పులకు తెగబడ్డారని, దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ఎదురుకాల్పులు జరిపామని చెప్పారు.  దీంతో తమ కాల్పుల్లో అరుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మవోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అసుపత్రికి తరలించారు. పోలీసులు అరుగురే అని చెబుతున్నా.. ఎనమిది మంది మరణించారని సమాచారం.

కాగా ఈ ప్రాంతం నుంచి మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకుని వుండవచ్చని, వారికి ఎస్కార్టుగా మరికొందరు మావోయిస్టులు వుండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రద్రి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles