CM scooter rally fails, not a 100 participate సీఎం స్కూటర్ ర్యాలీ అట్టర్ ప్లాప్ షోనా..?

Gujarat election cm scooter rally fails not a 100 participate

Gujarat CM, Vijay Rupani, rajkot, scooter rally, former aap leader, prashanth bhushan, common man, voters, utter flop, traffic violiations, gujarat election

Gujarat CM, Vijay Rupani organised a scooter rally in order to connect with the common man. However, it is an utter flop as not even a 100 people participated.

ITEMVIDEOS: సీఎం స్కూటర్ ర్యాలీ అట్టర్ ప్లాప్ షోనా..? వంద మంది కూడా లేరా.?

Posted: 12/01/2017 11:57 AM IST
Gujarat election cm scooter rally fails not a 100 participate

ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అదీనూ అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో వున్న పార్టీ. ఇటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఎంతో జోరుగా, హుషారుగా దూసుకెళ్లాల్సిన పార్టీ.. అందులోనూ ఏకంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో వేల మంది కార్యకర్తలు, పార్టీ నేతలు పాల్గోన్నాల్సి వున్నా.. కేవలం వందల మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా లేక వెలపలబోయి అట్టర్ ప్లాప్ షోగా మారింది. దీంతో ఇప్పటికే గుజరాత్ తో మా పార్టీ పరిస్థితి బాగోలేదు, అందులోనూ నా పరిస్థితి మరీ బాగోలేదు అన్న సీఎం వ్యాక్యలు నిజమన్న విషయన్ని గుజరాత్ ప్రజలకు గుర్తు చేస్తున్నాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజ్ కోట్ పట్టణంలో నిర్వహించిన స్కూటర్ ర్యాలీలో ఇదే పరిస్థితి ఎదురైంది. పట్టుమని వందమంది కార్యకర్తలు కూడా సీఎం ర్యాలీలో పాల్గోనలేదంటే అక్కడి ప్రజల నుంచి అదరణ ఎంతలా వుందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇక బీజేపి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేశారా..? అన్న సందేహాలకు తావిస్తుంది. సీఎం నిర్వహించిన స్కూటర్ ర్యాలీకే ఆశించినంత జనం లేక వెలవెలబోయిందంటే.. ఇక ఎమ్మెల్యేలు.. మంత్రుల ర్యాలీల పరిస్థితి ఎలా వుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మరీ ప్రధానమంత్రి సభలకు జనం పెద్దసంఖ్యలో ఎలా వస్తున్నారన్న విషయాన్ని బీజేపి నేతలే చెప్పాలి..

సీఎం విజయ్ రూపానీ ఓ స్కూటరు వెనుక కూర్చొని ర్యాలీలో పాల్గొనగా ఆయన వెనుక 25 స్కూటర్లపై కార్యకర్తలు అనుసరించారు. సీఎం వెంట అతని భద్రతా సిబ్బంది కాలినడకన వచ్చారు. గుజరాత్ సీఎం రాజ్ కోట్ లో నిర్వహించిన స్కూటర్ ర్యాలీలో కనీసం వందమంది కూడా లేరని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానిస్తూ స్కూటరు ర్యాలీ వీడియోతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టు కాస్తా వైరల్ అయింది.కాగా ఈ ర్యాలీలో పాల్గొన స్కూటరిస్టులు హెల్మెట్లు సైతం పెట్టుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మరో కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles