minister surprise visit stuns teachers ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన అమాత్యులు..

Minister surprise visit stuns teachers and shocks himself

minister, jagadeeshwar reddy, sudden visit, government school, 10th class students, silence on question, teachers stuns, suryapet, atmakur, telangana

telangana minister jagadeeshwar reddy suprised by his sudden visit to a government school, where he himself shock with 10th class students silence on his general questions which madke teachers stuns

ఆలస్యంగా గ్రహించిన అమాత్యులు.. గురువులపై గరం..గరం..

Posted: 12/01/2017 11:01 AM IST
Minister surprise visit stuns teachers and shocks himself

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యయులుగా ఎంపిక చేసేందుకు టెట్, టీఆర్టీ పరీక్షలను పెట్టి అందులో మెరిట్ ప్రాతిపదికన ఉత్తీర్ణలైన వారిని మాత్రమే ఎంపిక చేసినా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న విషయాన్ని అలస్యంగా గ్రహించారు ఓ మంత్రి. ఓ ప్రభుత్వ పాఠశాలకు అకస్మిక తనిఖీ కోసం వెళ్లి పదో తరగతి విద్యార్థుల ప్రతిభను తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సంధించగా వారి నుంచి వచ్చిన సమాధానాలతో ఆయన షాక్ అయ్యారు. దీంతో విద్యార్థులకు చదువులే రానప్పుడు ప్రభుత్వ టీచర్లకు ఉద్యోగాలు, పాఠశాలలు ఎందుకుంటూ ఆయన తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మ్యాటర్ లోకి ఎంటరైతే.. తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు చదువులే చెప్పలేని, మీకు ఉద్యోగాలెందుకు ఇళ్లకు వెళ్లిపోండి అంటూ మండిపడ్డారు. ఎందుకంటే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్‌) మండలంలోని పాత సూర్యాపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. త్వరలో 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న సందర్భంగా ఆయా తరగతి విద్యార్థుల వద్దకు వెళ్లిన ఆయన ఉపాధ్యయులు తరగతులకు సక్రమంగా వస్తున్నారా..? మీకు పాఠాలు బాగా చెబుతున్నారా..? మీకు వారు చెప్పే పాఠాలు అర్థమవుతున్నాయా..? అన్న విషయాలపై అరా తీశారు.

ఆ తరువాత వారి ప్రతిభను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేశారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందని మంత్రి అడిగారు. ఓ సబ్జెక్టులో ఏడో పాఠం పేరు ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. లెక్కలు అడగ్గా ఒక్క విద్యార్థి కూడా నోరు విప్పలేదు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. గతేడాది 10వ తరగతిలో ఎంత మంది ఉత్తీర్ణులయ్యారు అని అడగ్గా, 16 మంది విద్యార్థులకు ఒకరు మాత్రమే పాస్‌ అయినట్లు చెప్పడంతో మంత్రి ఉపాధ్యాయులపై మండి పడ్డారు. 30 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పలేకపోతే ఉద్యోగాలు మానేసి ఇళ్లకు వెళ్లండి అని మండిపడ్డారు. విద్యార్థులకు చదువు రానప్పుడు పాఠశాల ఎందుకు? మూసివేయమంటూ మంత్రి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles