Komatireddy gives clarity on new party పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన కోమటిరెడ్డి

Komatireddy venkat reddy gives clarity on new party

Congress Senior leader, nalgonda MLA, Komatireddy Venkat Reddy, chief minister KCR, bangaru telangana, komati reddy on new politcial party, komati reddy on changing party, komati reddy on congress party, komati reddy on kcr deceiveness

Congress MLA Komatireddy Venkat Reddy alleged that KCR deceived the people in all issues- double bed room houses, KG to PG education and medical health sectors.

పార్టీ ఏర్పాటుపై స్పష్టతనిచ్చిన కోమటిరెడ్డి

Posted: 11/29/2017 04:01 PM IST
Komatireddy venkat reddy gives clarity on new party

తనకు కాంగ్రెస్ పిసిసీ పదవిని ఇస్తే ఎంతటి శ్రమకైనా ఓర్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పినా.. తన మాటలను లక్ష్యపెట్టని అధిష్టానం తనకు పదవిని నేపథ్యంలో నల్గోండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారుతున్నారన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. అయితే విటిపై ఎట్టకేలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

తాను కొత్త పార్టీని స్థాపిస్తున్నానని, అందులో భాగంగానే ప్రముఖ పాత్రికేయుడు, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును కలిసినట్టు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. మొదటగా తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తన అభిమానులు, కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని కోరారు. ఇలాంటి తప్పుడు వార్తలను కొందరు  తనకు వ్యతిరేకంగా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఇక తాను కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తున్నానని వస్తున్న వార్తలు కూడా సత్యదూరమైనవేనని అన్నారు. మర్యాద కోసం రామోజీరావును కలిసినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిందన్న కథనాలు సృష్టించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను ఎటువంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లనని చెప్పుకోచ్చిన ఆయన తాను చనిపోయిన తర్వాత కూడా తనపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamati reddy venkat reddy  new party  party change  congress  clarity  telangana  politics  

Other Articles