Hyd metro announces ticket minimum charge for passengers మెట్రో రైళ్ల సేవలు, సమయాలపై క్లారిటీ

Hyd metro announces timings starts from 6 am to 10 pm

Prime Minister Narendra Modi, PM modi, hyderabad metro rail, metro train Shedule, metro rail services, metro rail charges, pm modi metro rail, miyapur, kukatpally, metro rail project, telangana

Hyderabad Metro Rail project anounces today that metro rail services begins from 29th, the first train moves at 6am and last train ends up by 10 pm

మెట్రో రైళ్ల సేవలు, సమయాలపై క్లారిటీ

Posted: 11/25/2017 02:29 PM IST
Hyd metro announces timings starts from 6 am to 10 pm

హైదరాబాద్ మెట్రో సర్వీసులను ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్న సందేహాలు నగరవాసుల్లో వ్యక్తం అవుతుంది. కాగా ఈ సందేహాలను నివృత్తి చేస్తూ ఇవాళ మెట్రో రైల్ అధికారులు నవంబర్ 29వ తేదీ నుంచి మెట్రో రైల్ సేవలు ప్రారంభం అవుతున్నాయని ప్రకటించారు.

నాగోలు నుంచి మియాపూర్ వరకు 30కిలోమీటర్ల దూరంలో 24 స్టేషన్లు ఉన్నాయన్నారు. ఒకేసారి 30 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రూట్ మొత్తాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్న చరిత్ర హైదరాబాదు మెట్రో రైలుదేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ-సవారీ పేరుతో రోజువారీ మెట్రో వివరాలను అందించటానికి త్వరలోనే యాప్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఉదయం 6 నుంచే సర్వీసులు :

29వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటలకు నగరవాసులు సౌకర్యార్థం మెట్రో రైళ్లు నడుస్తాయి. ప్రారంభంలో ప్రతి 20 నిమిషాలకు ఓ రైలు తిరగనున్నట్లు తెలిపారు. క్రమంగా టైం తగ్గిస్తూ.. సర్వీసులు పెంచటం జరుగుతుంది. రద్దీని అనుగుణంగా ఐదు, మూడు నిమిషాలకు కూడా సర్వీసు నడపగల సామర్ధ్యం ఉందన్నారు. ప్రస్తుతం 57 రైళ్లు అందుబాటులో ఉన్నాయని..వాటి సామర్యం మేరకు అవి ప్రయాణికులకు సేవలందిస్తాయని చెప్పారు.

ఇక ప్రతి రైలుకి మూడు కోచులు ప్రస్తుతం ఏర్పాటు చేయగా, భవిష్యత్ లో ప్రయాణికుల సంఖ్య పెరిగే కోద్ది అరు కోచ్ ల వరకు పెంచుకునే సదుపాయం ఉంది. ఒక్కో కోచ్ లో 330 మంది చొప్పున.. వెయ్యి మంది ప్రయాణం చేయొచ్చు. రద్దీకి అనుగుణంగా ఆరు కోచ్ ల వరకు పెంచుకోవచ్చన్నారు. నెల, రెండు నెలల్లోనే ఉదయం 5.30గంటలకే సర్వీసులు ప్రారంభం అయ్యి.. రాత్రి 11 గంటల వరకు రైళ్లు తిప్పనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles