MP heir who attacked TDLP secretary identified సిటీసెంటర్ దాడి: ‘ఎంపీ’ కూతుర్ని గుర్తించిన పోలీసులు

Police identify city center attacked mp s daughter

Woman attacked, couple, Suresh, bhanu, Police complaint, hyderabad police, banjara hills police, Madhya Pradesh, Businessman, Ruling MP daughter, crime

hyderabad police identifies MP daughter who attacker TDLP secretary in city center mall and claimedthat she is ruling party MP's daughter.

సిటీసెంటర్ దాడి: ‘ఎంపీ’ కూతుర్ని గుర్తించిన పోలీసులు

Posted: 11/13/2017 10:33 AM IST
Police identify city center attacked mp s daughter

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ పదిలో వున్న సిటీ సెంట్రల్ మాల్ లో జరిగిన ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగిరం చేసి ఎట్టకేలకు అక్కడ హంగామా సృష్టించి.. దాడికి పాల్పడిన ఆ ఎంపీ కూతుర్ని గుర్తించారు. ఘటన ఎలా జరిగింది.. అందుకు కారణం ఎవరన్న వివరాలను తెలుసుకున్న పోలీసులు.. ఎంపీ కూతరిగా తనకు తాను చెప్పుకున్న యువతిని అన్వేషించే పనిలో పడి.. ఇరవై రోజుల తరువాత అమెను గుర్తించి నోటీసులు జారీ చేశారు. సిసిటీవీ ఫూటేజీ అధారంగా యువతిని గుర్తించి అమె ఎవరన్న వివరాలను తెలుసుకున్నారు.

సిటీ సెంట్రల్ మాల్ లో అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శిగా బాధ్యతులు నిర్వహిస్తున్న సురేష్, అతని భార్యను నెట్టుకుంటూ వచ్చి వారితో అమర్యాదగా ప్రవర్తించింది. ఎందుకు నెడుతున్నావంటూ వారిపైనే తిరగబడింది. తాను ఎంపీ కూతుర్ననని పేర్కోంది. మాల్ లోని వారు అడ్డుపడటంతో కిందకు వెళ్లింది. అయితే అంతటితో అమె ఉక్రోశం చల్లారకపోవడంతో.. వారిపై మరోమారు సెల్లార్ లో కారు పార్కింగ్ వద్ద కూడా దాడికి పాల్పడేందుకు యత్నించింది.

సెల్లార్ లో మాల్ సెక్యూరిటీతో పాటు సురేష్ భద్రతా సిబ్బంది అడ్డురావడంతో.. అమె.. సురేష్ కారు అద్దాలను ధ్వంసం చేసింది. దీంతో సురేష్‌ తన భార్యతో భానుతో కలసి బంజారాహిల్స్ పోలీసులకు అమె కారు నెంబరు టీఎస్ 10 ఈఎల్ 0777 నెంబరు అధారంగా పిర్యాదు చేశాడు, దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్‌ దంపతులపై అకారణంగా దాడికి పాల్పడిన యువతిని గుర్తించి అమెపై ఐపీసీ సెక్షన్‌ 323, 509, 341 కింద కేసు నమోదు చేశారు. సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సీఆర్పీసీలోని సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఆమె స్పందించే తీరును బట్టి చర్యలు తీసుకోనున్నారు. కేసు పూర్వా పరాల నేపథ్యంలో ఆమెను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.

దాడికి పాల్పడింది ఎంపీ కూతురే..

టీడీఎల్పీ కార్యాలయ కార్యదర్శి సురేష్ అతని సతీమణి భానుపై దాడికి పాల్పడిన యువతి తనకు తానుగా ఎంపీ కూతుర్ని అని చెప్పకోవడంతో.. అ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు అమెను గుర్తించారు. అయితే దాడి చేసిన యువతి బాలం రాయ్‌కు చెందిన నగల వ్యాపారి కుశాల్‌ జయంతి లాల్‌ పర్మార్‌ కుమార్తె భవ్య పర్మార్‌(20)గా గుర్తించారు. అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసుకొని ఇటీవలే తిరిగి వచ్చారని,  ఆ రోజు తన చిన్నమ్మ, చిన్నాన్నలతో కలిసి షాపింగ్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అమె చెప్పినట్లు అమె ఎంపీ కూతరంటే.. అమె మధ్యప్రదేశ్ (ఎంపీ) అడపడచునని చెప్పుకొచ్చిందన్నమాట. కానీ అందరూ భావించినట్లు అమె పార్లమెంటు సభ్యుల సంతతికి చెందిన యువతి కాదు. గతంలో పర్మార్ అనే వంశీయులు ఎంపీలోని మాల్వా ప్రాంతాన్ని పాలించారు. దాంతోనే అమె తాను ఎంపీ కూతుర్ని అని చెప్పకోచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman attacked  couple  Suresh  bhanu  banjara hills police  Madhya Pradesh  Businessman  MP daughter  crime  

Other Articles