Bhojpuri film director commits suicide ప్రముఖ దర్శకుడు ఆత్మహత్య.. కారణం అదేనా..?

Film director shad kumar commits suicide

Swarg', Shamshad Ahmed, shad kumar, Satish Nikam, Mira Road, Bollywood, assistant photographer, Bhojpuri films, Bhojpuri film, suicide, crime news, latest news

Film director Shad Kumar alias shamshad Ahmed, (50) allegedly committed suicide by hanging himself at his residence apartment in New Saloni Heights Cooperative Society at Mira Road.

ప్రముఖ దర్శకుడు ఆత్మహత్య.. కారణం అదేనా..?

Posted: 11/11/2017 05:22 PM IST
Film director shad kumar commits suicide

ప్రముఖ దర్శకుడు షాద్ కుమార్ ఇక లేరు. ఆయన తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడh భోజ్ పురిలో ఈయన దర్శకత్వం వహించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 49 ఏళ్ల వయస్సు గల దర్శకుడు షాద్ కుమార్ అసలు పేరు షంషాద్ అహ్మద్. మీరా రోడ్డులోని సలోని హైట్స్ కొఆపరేటివ్ సోసైటిలో అపార్టుమెంట్ కొన్న ఆయన ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

షాద్ కుమార్ దర్శకత్వం వహించిన ‘స్వర్గ్‌’ సినిమా ఈ నెల 24న రిలీజ​ కావాల్సి ఉంది. అయితే ఆయన మరణించటంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. బోజ్ పూరి చిత్ర పరిశ్రమలో విషాధఛాయలు అలుముకున్నాయి. భోజ్‌పురిలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన షాద్‌ కుమార్‌ ‘ఏక్‌ లైలా, తీన్‌ చైలా’, ‘తుమ్‌ హారే ప్యార్‌కి కసమ్‌’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

చిత్రపరిశ్రమలో అసిస్టెంట్ ఫొటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనకు దర్శకత్వంపై మక్కువతో.. క్రమక్రమంగా ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎదిగాడు. అంతకుముందు ఆయన నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన స్వియ దర్శక, నిర్మాణ చేపట్టిన చిత్రాలను ప్రేక్షకులు అదరించకపోవడంతో అవి కాస్తా బాక్సాఫీసు వద్ద ఫ్లాఫ్ లుగా మిగిలాయి. దీంతో షాద్ కుమార్ కు నష్టాలు మిగాలాయి. దీంతో తీసుకున్న అప్పులు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shamshad Ahmed  shad kumar  Satish Nikam  Mira Road  Bollywood  Bhojpuri film  suicide  crime  

Other Articles