Raghuram Rajan in AAP shortlist for Rajya Sabha రాజ్యసభలోకి రఘురాం రాజన్.. మోడీ అర్థిక విధానాలే టార్గెట్..?

Arvind kejriwal offers raghuram rajan rajya sabha nomination

raghuram rajan, aap, rajya sabha, rajya sabha mp, rbi governor, Arvind Kejriwal, delhi, Aam Aadmi Party, delhi rajya sabha seats, politics

According to media reports quoting sources, former RBI governor Raghuram Rajan may become Rajya Sabha MP from Arvind Kejriwal led Aam Aadmi Party (AAP).

రాజ్యసభలోకి రఘురాం రాజన్.. మోడీ అర్థిక విధానాలే టార్గెట్..?

Posted: 11/08/2017 03:39 PM IST
Arvind kejriwal offers raghuram rajan rajya sabha nomination

భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ గా సేవలందించిన ప్రపంచ అర్థిక రంగ నిపుణులు రఘురాం రాజన్ త్వరలో భారత పెద్ద మనుషుల సభకు ఎన్నికల కానున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ప్రపంచ దేశాలన్ని రిసెషన్ ను ఎదుర్కోని కాకవికలం అవుతున్నా.. ఆయన అర్థిక విధానాలతో దేశం ద్రవ్యోల్భణ విపత్తును అధిగమించి నిలదొక్కుకొగలిగిందని.. అంతటి మేధావిని రాజ్యసభకు పంపాలని మరో మేధావి వర్గానికి చెందిన ముఖ్యమంత్రి పూనుకున్నారు.

ఆ ముఖ్యమంత్రే అప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్. తన పార్టీ తరపున ముగ్గురు సభ్యులను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం రావడంతో ఆ ముగ్గురినీ మేధావులను పంపాలని భావిస్తున్నారాయన. ఈ క్రమంలో అందులో ఒకరైన అర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం.

2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి.. 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 66 సీట్లు గెలుపొందింది. దీంతో దిల్లీ వాటాలో ఆమ్‌ ఆద్మీకి మూడు రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఈ సీట్లు 2018 జనవరికి ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ సభ్యుల ఎంపిక ప్రారంభించింది. అయితే పార్టీ నేతలకు కాకుండా బయటి వ్యక్తులు, ప్రముఖ నిపుణులకు ఈ సీట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రఘురాం రాజన్ పేరును కూతా తెరపైకి తీసుకువచ్చింది. అయితే అప్ అఫర్ పై రాజన్‌ కూడా సుముఖంగానే స్పందించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram rajan  aap  rajya sabha  Arvind Kejriwal  delhi  politics  

Other Articles