Rahul Gandhi can lead India: Shiv Sena మోదీపై మిత్రపక్షం విసుర్లు.. ప్రతిష్ట దిగజారుతుందని వ్యాఖ్య

Modi wave has faded rahul gandhi ready to lead india shiv sena

Rahul Gandhi, PM Modi, Narendra Modi, sanjay raut, Congress, Shiv Sena, rahul gandhi popularity, BJP, Congress, Election Promises, rahul gandhi social media

“The people of the country are now interested in what Rahul Gandhi says and who he meets. This means that Rahul is emerging as a leader in this country,” Raut added.

మోదీపై మిత్రపక్షం విసుర్లు.. ప్రతిష్ట దిగజారుతుందని వ్యాఖ్య

Posted: 10/27/2017 11:58 AM IST
Modi wave has faded rahul gandhi ready to lead india shiv sena

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేన పార్టీ.. తమ మిత్రపక్షమైన బీజేపిపై మరోసారి విమర్శల విసుర్లు విసిరింది. మూడున్నరేళ్ల కిత్రం దేశప్రజల్లో కొనసాగిన మోదీ మానియా మసకబారుతుందని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం ఏదో చేస్తుంది.. ఎంతో చేస్తుందని బ్రహ్మాండమైన మోజారిటీని అందించిన ప్రజలకు తన పాలనలో మోదీ అకట్టుకోలేకపోయారని దీంతోనే అయన ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.

ఎన్నికలకు ముందు దేశప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను మూడున్నరేళ్లు గడిచినా మోదీ సర్కార్ నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. ఇదే సమయంలో మన దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనిపిస్తున్నారంటూ ఆయన కితాబిచ్చారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై అంచెలంచెలుగా పోరాటం చేస్తూ.. నిత్యం క్షేత్రస్థాయిలో వుంటున్న రాహుల్ రాజకీయాలలో మరింత దృడమైన నేతగా ఎదిగారని ప్రశంసించారు.

ఓ టీవీ చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయని విమర్శించారు. ఈ రెండింటివల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పారు.

దేశంలో చాలా మంది నేతలు తమకుతామే గొప్ప అని విర్రవీగుతున్నారని... రాహుల్ ను 'పప్పు' అని సంబోధిస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ ప్రభావం ఏంటో అందరికీ తెలుస్తుందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ స్పష్టమైన ప్రభావం చూపే పరిస్థితి నెలకొందని అన్నారు. దేశాన్ని సమర్థవంతంగా నడిపించే శక్తి రాహుల్ కు మాత్రమే ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  narendra modi  sanjay raut  rahul gandhi  shiv sena  BJP  Congress  Election Promises  

Other Articles